ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ ప్రకరణము

కొంతవడికటు లా సిపాయిలు నదిఁజేరి యందఱు నీద నేర్పియున్న వారగుటవలనఁ దమయిష్టమువచ్చినట్లు నీళ్లతోఁజెర్లాట మాడుకొనసాగిరి. నాఁడు గృష్ణపక్ష పాడ్యమి యగుటయునప్పటికి చంద్రమండలము బాగుగ ప్రకాశింపుచు నెక్కివచ్చు చుండెను. వాన సంపూర్ణముగ వెలిసి ధూళిలేక నిర్మలమైన వాయువులు వీచుచుండెను. నదీతీరమంతయు హోరుమను గప్పల రొదలతో నిండియుండెను. ఇవికాక క్రిమికీటకములు కీచుమని శబ్దించుచుండెను. ఆకసమునం దేభా గమునను నించుకైన మబ్బులేక ప్రకాశమానమై వెన్నెల కాయుచుండ నా సిపాయిలు సదియం దొండొరులపై నీరములఁ జిమ్ముకొనుచుఁ గొట్టుకొనివచ్చు దుంగలు మొదలగువాని నొడ్డునవైచుచు నింకను ననేకగతుల వర్తించుచుండిరి. నీటఁబడి వచ్చువానిఁ బట్టుకొని

11