ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

రంగూన్‌రౌడీ.

      ధనమానములు ప్రాణధనము నీ కర్పించి
                     మది నమ్మినందుల కిదిఫలంబ ?
      ప్రాణేశ్వరుని గడ్డిపరకగాఁ బోనాడి
                     యిటు వచ్చినందుల కిదిఫలంబ ?
      ఏబదివేల్ జవాహిరి నయాచితముగ
                     నిచ్చి నమ్మినదాని కిదిఫలంబ ?

      ఈమహైశ్వర్యముల కెల్ల నిదిఫలంబ ?
      మదిని నిను విశ్వసించుట కిదిఫలంబ ?
      ఏరుదాటి తెప్పనుగాల్చు క్రూరబుద్ధి
      వని యెఱుంగక చెడితినిరా ! దురాత్మ !

శంక - (కొంచెము సురాపానము చేసి) ఓసీ ! ప్రభావతీ ! కడుపెద్ద యుపన్యాసము నిచ్చి యలసిపోతివి గాని, చాల పొరఁబడితివి. నీవు చెప్పినవానికి గాదు సుమా యీఫలము! కాక ఏమంటివా! నేను చెపెద్పద నాలకింపుము.

సీ. పెండ్లియాడినభర్త కండ్లకు మసిఁబూసి
                     యిలు వీడి వచ్చుట కిదిఫలంబు
    భవితవ్యమునవచ్చు పాట్ల నెఱుంగక
                     మదమెక్కినట్టి నీ కిదిఫలంబు
    మగనిప్రాణము ఱంకుమగఁడు దీయుచునుండ
                    నీక్షించినట్టి నీ కిది ఫలంబు
    మోహాంధకారవిమూఢవై జారిణీ
                    కృత్యంబు చేయుట కిదిఫలంబు

    అందమునకు మిగుల హానినిఁ గూర్చెడు
    హీనగుణము లుంట కిధిఫలంబు
    విధి లిఖించినట్టివిధమును మార్ప నీ
    తరమె ! వట్టివెఱ్ఱితనము గాక.