ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రంగూన్ రౌడీ.
అను
పతిభక్తి.
పంచమాంకము.
రంగము-1.
స్థలము:- విజయనగరములో.
[సారాయిబుడ్డి చేతఁబట్టుకొని, శంకరరావు ప్రవేశించును.]
(అనుబంధము - 21.)
శంక -
తెలివిలేని ముసలిబ్రహ్మ ఒకసారి మానవునినుదట లిఖింపక నే యుండవలయును. లిఖించిన యదృష్టరేఖను తుడిచివేయ వానికిమాత్రము సాధ్యమగునా ! (మీసము దువ్వుచు) భలీ ! శంకరరావ్ ! నీయదృష్ట మసామాన్యమైనది. దానికి చలనములేదు. ఈ ప్రపంచమునందలి మానవమాత్రుఁ డెవ్వఁడును నీయదృష్టజ్యోతిని తేరిచూడఁజాలఁడు.
సీ. జనకునిస్వార్జితం బనుభవింపగనీని
పవరుదారును నేలపాలుచేసి
బంధింపవచ్చిన శ్వశురు మోసముఁజేసి
సాగరంబునఁ బడి చావకుండ
తనయిల్లుజేర్చిన ఘనునికన్నులలోన
కారముఁజల్లి తత్కాంతవలచి
వెదకుచు నా వెనువెంటనే వచ్చిన
యాత్మదారనుసైత మవల ద్రోసి