ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

రంగూన్‌రౌడీ.

వున్నది. వాఁడికి రాధాబాయి నిచ్చి వివాహం చేస్తేనీకుమార్తెను వదిలేస్తాను. ఇఁక నీయింటినెందు కాశ్రయించుకున్నానంటే, నువ్వు అన్యాయంగా శంకరరావుఆస్తిని అపహరించావు. ఆ పాపపుఆస్తిని నువ్వువొదిలించుకుంటే నీయింటినివొదలిపోతాను. ఈ రెండుపనులలోనువ్వు ఏదిమానినా నిన్నూ, నీకూతుర్నీ, నీకుటుంబాన్ని నాశనం చేస్తానని తెలుసుకో!

జయ్ భేతాళభూతరాం

ఓం-హ్రీం- హ్రైం-క్షామ్ - హుమ్ - ఫట్.”

గంగా - (భయముచే వణఁకుచు) అరే దర్వాన్ !

జయ - అరే భగవాన్ !

గంగా - అరే దర్వాన్ !

జయ - అరే భగవాన్ •

గంగా - దర్వాన్ !

జయ - భగవాన్ !

గంగా - దర్వాన్ !

జయ - సైతాన్ !

గంగా - అరే దర్వాన్ !

జయ - అరే సైతాన్!

గంగా - (కొంచెముతమాయించుకొని) ఇప్పుడేమి చేయుమనినీసలహా ?

జయ - సందేహమేమి? సైతాన్ వ్రాసినట్టే.

గంగా -- సైతానువ్రాసినట్టు ఒక్కనాడు చేసేవాఁడనుగాను. భూతవైద్యము చేయించి సైతానును వెళ్ల గొట్టిస్తా.

జయ - ఆపనిచేస్తే చాలా బాగుంటుంది. వెళదాం రండి.

(ఇరువురు నిష్క్రమింతురు.)


__________

లు-