ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

రంగూన్‌రౌడీ.

కృష్ణ. -అక్కా ! కూర్చుండుఁడు. చిన్నవాఁడనైన నాయొద్ద మర్యాద యేల ! (కూర్చుండును.)

మోహ - అమ్మా ! అమ్మా ! (తల్లిదగ్గరకు పోవును.)

అన్న -- నాయనా! నామోహనా! నీ దెట్టిదురదృష్టజాతకమురాతండ్రీ.!

చ. ధనముగలంతకాలమును, తప్పక నీతఁ డదృష్టజాతకుం డనుచు వచింతు భావిఫల మంతయుఁ దెల్పెడివారిపోల్కె బ్రాహ్మణులు ధనాశచేత; నిజమంచుఁదలంత్రు జనంబు దాని; నీ యనుపమఫాల భాగలిఖితార్థముఁదెల్పఁడు జోస్యుఁడొక్కఁడున్.

కృష్ణ - అక్కా! పండితులపల్కు లొక్కనాఁడును ప్రమాణరహితములు కాఁజాలవు. వారు వచించిన చందమున నాచిన్నిమేనలుఁడు తప్పక అదృష్టజూతకుఁడే కాఁగలఁడు.

అన్న — తమ్ముఁడూ ! కలిపోసినను ఉట్టివంకకే చూచె ననువిధమున మాటాడుచుంటివిగదా ! ఐశ్వర్యమంతయుఁ దగులఁబడిపోయినను, అల్లుఁడుమాత్ర మదృష్టశాలియే యనుచుంటివి.

కృష్ణ - -సోదరీ! కుఱ్ఱవానివిషయమున నీకిట్టిబెంగతో నిమిత్తములేదు. ఏమందువేని.

ఉ. తల్లియుఁ దండ్రియున్ సుతులు తాతలు నేతలు కల్గ రెవ్వరున్ చెల్లకయున్న దీధన మశేషముగా, తిన దిక్కు లేక నా కెల్లవిధంబులన్ సుఖము నిచ్చె నిలన్ పరమేశ్వరుండు, నా యల్లున కిత్తు నాధనమునందు సగంబు; సతీవతంసమా !

అన్న – నాయనా! నీయుదారహృదయమునకు భగవంతుఁడు నిన్నాశీర్వదించునుగాఁ ! ఎప్పటికి నీకిట్టిబుద్ధియే స్థిరమైయుండుఁ గాక ! నీవు నామఱదలగు జానకిని ప్రేమించి వివాహమాడఁ దలంచినందువలననే మీకును మాకును గలసంబంధముగాని, నిజము విచారించినచో అంతకన్న మాపై దయఁదలంచు నవ