తృతీయాంకము.
35
అన్నిజాతుల కాలిపన్నాలదెబ్బల
శ్రమ కోర్చువారు కోరంగివారు
మానంబు వోనాడి మలమూత్రములను శు
భ్రముచేయువారు కోరంగివారు
కొట్టినను తిట్టిన సహించి, గొడ్లవోలె
లొంగియుండు బానిసలు కోరంగివారు
నాగరకతయు, దేహసౌందర్యగరిమ
యుం గలుగనట్టివారు కోరంగివారు.
శంక - హరి హరీ ! ఈపాపపుచెవులతో నెట్టిమాటలు వినుచున్నాను! ప్రభావతీదేవీ ! ఎట్టిగౌరవనీయ మైనజాతి కీనగరమునం దెట్టిదుర్గతి గలిగినదో తలంచినకొలదియు గుండెలు వ్రీలిపోవుచున్నవి.
సీ. ఆందోళికలనెక్కు- నాంధ్రజాతికి నేఁడు
[1]లంచాల నీడ్చుకాలంబు వచ్చె
అవనిఁ బాలించిన యాంధ్రజాతికి నేఁడు
కూలిచే జీవించు గోఁడువచ్చె
అతిశౌర్యవంతమౌ నాంధ్రజాతికి నేడు
[2]పన్నాలదెబ్బల పాట్లు వచ్చె
అధికగౌరవనీయ మాంధ్రజాతికి నేఁ డ
శుద్ధంబు తుడిచెడి క్షోభ వచ్చె
అసమసాధ్వీత్వంబున కీర్తినందినట్టి
యాంధ్రజాతికి లంజలౌ నపయశస్సు
వచ్చె; నాగరకత గల్గువారి కిపుడు
మోటువారను కట్టడిమాటవచ్చె.
అన్నిటిమాట యట్టుండగా నీకోరంగియను బిరుద మెక్కడి నుండి దాపురించెనా యని
నాకాశ్చర్యముగా నున్నది.