ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

రంగూన్‌రౌడీ.

కృష్ణ - (రాధాజయరాముల చేతులు పట్టించును. అందఱు దీవింతురు.)

పాట.

మారాధమ్మ పెండ్లికూతు రాయెనే! మా!!
జయరాము పెండ్లికొడు కాయెనే మా
ఆనంద మానంద | మానంద | మానంద |
మానందమాయే | బ్రహ్మానందమాయే! మా||

(తెరవ్రాలును.)

రంగము -3.

స్థలము:- ఒకబయలు.

[విచారముతో శంకరరావు ప్రవేశము.]

శంక - కటకటా! ఎంతకఠినకర్ముఁడను- ఎంతపాపాత్ముఁడను. ఈ ఛండాల జన్మున కింక నీధరణిపై తరణోపాయము గలదా ! హా ! అన్నపూర్ణా! అన్నపూర్ణా! ఓమహాసాధ్వీ! పవిత్రమై అనిర్వచనీయమై, అనుపమానమై, అనన్యదుస్సాధ్యమైననీపాతివ్రత్యమే యీనిర్భాగ్యు నింతకాలము రక్షాకవచమై కాపాడినది. అందులకుప్రతిఫలముగా నేను నీ కేమొనరించితిని! ఆహా! తలుచుకొనిన గుండెలు బ్రద్దలగుచున్నవి. ప్రాణములు తల్లడిల్లుచున్నవి! పవిత్రమైన నీశిరమునుధూళిధూసరితమౌనట్లు తన్నిన యీపాపాత్మునిపాదము లింకనువిరిగిముక్కలు గాకున్నవేమి? పరమపావనతరమైన నీనామమునుచ్చరించుటకైనను అర్హముగాని యీపాడునాలుక గర్భనిర్భేదముగ నిన్ను దూషించి నందులకై యింకను పురుగులు పడిపోవకున్న దేమి ! దివ్యతమకాంతిపుంజములచే నావంటి కలుషస్వరూపునకు తేరిచూచుటకైనను సాధ్యముగాని నీశరీరమునుండి రక్తధారలు నేలనొలుక కటారిచే పొడిచిన యీపాపిహస్తమింకను