ఈ పుట ఆమోదించబడ్డది

పంచసంధులు

మానవుడు ఒకానొక విర్ద్ల్హిష్టకార్యాన్ని సాధించడానికి ప్రారంభించి, ఆ యత్నంలో అదురైన అడ్దంకులను అధిగమించి ఫలసిత్థిపొందురాడు. లేదా అడ్డంకులను అధిగమించలేక నశించిపోతారు. రూపక విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. భారతీయల దృష్టిలో విషాదాంతము పనికిరాదు కాబట్టి సంస్కృతంలో విషాదాంత రూపకాలు వెలువడలేదు.

ఒకానొక నిర్ధిష్టకార్యానికి హేతువు నాటకపరిభాషలో బీజము (Permise) అంటారు. ఈబీజము మొలకెత్తి పెద్దదై ఫలవంతముకావడమే ఫలసిద్ధి. ఒక నిర్ధిష్టకార్యము సాధించవలెనని తలపెట్టినంత మాత్రానచాలదు. కార్యాచరణ ప్రారంభముకాచలె. బీజము ప్రారంభము కావడమే నాటక పరిభాషలో ముఖసంది. (బీజము+ప్రారంభము = ముఖసంది).

అభిజ్ఞానశాకుంతల నాటకంలో శకుంతలా దుష్యంతుల సమ్మేళనము కార్యము. దుష్యంతుడు శకుంతలను జూచి-

నృప పరిగ్రహయోగ్య యీ నెలత నిజము
కాక, నామది నిర్ధోష మీకె నెట్లు
దవులు రెండు సందేహ వస్తువులయందు
నాత్మగతులె ప్రమాణములు లార్యులకును.1

అనుకోవడంలో శకుంతలా దుష్యంతుల సమ్మేళనానికి బీజమేర్పడించి. శకుంతల తుమ్మెదచ్వల్ల బాధ పడుతూఉంటే "బయల్వెడలుటకిగియ మంచి సమయము" అని దుష్యంతుడు శకుంతలముందు ప్రత్యక్షము కావడం ప్రారంభము. ఈ బీజప్రారంబాల కలయికగల కధాభాగమే ముఖసంది. ఈ ముఖసంది రెండవ అంకంలో కొంతవరకు వ్యాపించింది.

కార్యనిర్వహణ ప్రారంభించినంతమాత్రాన చాలదు. యత్నించవలె. ఈ యత్నాన్నే నాటకపరిభాషలో ప్రయత్నమంటారు. అయితే ఈ యత్నంలో ఆటంకము రావచ్చు. ఈ ఆటంకంలో కధ తెగిపోకుండా కాపాడేది బిందువు. బించు ప్రయత్నాల కలయికల కధాభాగము ప్రతిముఖసంది. శాకుంతలము.


1--వీరేశలింగంగారి అనువాదము. ప్రధమాంకము, పుట.10