సంస్కృత రూపకరచనా విధానము
ఇది పద ద్వంద్వార్ధంమీద, సమన్వయంమీద ఆధారపడిఉంటుంది. "ఒక అర్ధము నుద్దేశించి ప్లికిన వాక్యమునకు ఆగంతుకభావముచే నిగూఢమగు అన్యార్ధస్పురణము పతాకాస్థానకము." 1
ఈ పతాకస్థాపకము నాలుగువిధాలు.
ఒకటవ పతాకస్థాపకము: "ఉపకారకమైన వాక్యముచే లేదా క్రియచే అచింతితముగా ఉత్కృష్టమగు అర్ధము సాధింపబడినచొ అది ప్రధమ పతాకస్థాపకమగును"
ఉదా|| రత్నావళినాటిక రెండో అంకంలో రాజు సాగరికచేయి పట్టుకొని అనునయిస్తాడు. కాని ఆమె ఎంతసేపటికీ కోపము వీడదు. అప్పుడు విదూషకుడు "ఓహ్ నిశ్చయంగా ఈమ మరియొక కోపగత్తె వాసవదత్త" 2. అని అంటాడు. అంతట రాజు భయంతో సాగరిక చేతిని వదలుతాడు. ఇందులో విదూషకుని భావము సాగరిక అపరవాసవదత్త అని. కాని రాజు వాసవదత్త వస్తున్నదనే అర్ధము తీసుకొంటాడు. అంటే ఒక అర్ధంలో విదూషకుడు అన్న మాటను రాజు ఇంకోఅర్ధంలో తీసుకొన్నాడన్నమాట.
రెండవ పతాకస్థాపకము: "ప్రకృతమునకు సంబందించి సాతిశయముగా శ్లిష్టముగా (రెండర్ధములు వచ్చునట్లుగా) చెప్పబడిన వాక్యము రెండవ పతాకాస్థానకమగును" 2.
ఉదా|| వేణీసంహార ప్రస్తావనలో సూత్రధారుడు శరదృతువును వర్ణిస్తూ "ధార్తరాష్ట్ర శతంబు భూతలమునందు వ్రాలెడును జిత్రముగ గాలవశము చేత" అని అంటాడు. ఇందులో ధార్తరాష్ట్రశతకము అనెదానికి రెండర్ధాలు- హంసలదండు, కౌరవులు అని. ఒక అర్ధంలో ఈ శరత్కాలంలో హంసలు నేలమీద వ్రాలినవని, ఇంకోఅర్ధంలో కౌరవులు నేలకూలినారు అని, అంటే చనిపోయినారని.
మూడవ పరాకస్థాపకము; "అస్ఫుటముగానున్న అర్ధమును సముచితమగు ప్రత్య్హుత్తరముచే విశేషనిశ్చయనహితముగా స్ఫుటమొనరించు వాక్యము.
1.--డా. పి.యస్.ఆర్.అప్పారావు నాట్యశాస్త్రానువాదము.
2.--వేదం వారి అనువాదము.