ఈ పుట ఆమోదించబడ్డది

పతాకాస్ధానకము

తనలో "నేనే స్వతంత్రురాలనైతినేని" అనడంతో ఆమె ఆంతర్యము విశదమవుతుంది. "నేనే స్వతంత్రురాలనైతినేని" అనే వాక్యము స్వగతము. ప్రేక్షకులనుగాని, ఇంకెవరినిగాని ఉద్దేశించి చెప్పినదికాదు. ఇంత మాత్రమే స్వగతము. ఆతరవాత వాక్యాలు అందరూ వినదగినవి. బిగ్గరగా మాటాడవచ్చునని సూచించడానికి స్వగతము తరవాత "ప్రకాశముగా" అని వ్రాయడం ఒక సాధన. 'ప్రకాశముగా ' అంటే అందరు వినదగినది. శకుంతల "ఇప్పుడు నేనేమియు నీఆజ్ఞకులోబడి యుండలేదు" అని అనడం ప్రకాశము.

అపవరితము

ఇతరులకు వినబడకుండా ఒక్కనికే రహస్యంగా చెప్పటం.

ఉదా|| ప్రతాపరుద్రీయంలో యుగంధరుడు విద్యానాధుని కౌగిలించుకొంటాడు. అఫ్ఫుడు విధ్యానాధుడు: (కౌగిలింతలోనే చెవిలో) "రాజును తురక ఢిలీ గొనిపోయినాడు." యుగంధరుడు: "ఏన్నాళ్ళకెన్నాళ్ళకు" (అని మరల కౌగిలించుకొని చెవిలో) "వేటగాయములతో రాజు బెండపూడిలొ రామావధానుల ఇంట నున్నట్లు జాబు తెప్పింపుము."

విధ్యానాధుడు: (కౌగిలింతలోనే చెవిలో) "చిత్తం".

జనాంతికము

ఇదీ ఒక విధమైన అవతారికమే. రంగంమీద ఉన్నవారిలో ఆమాటలు వినకూడనివాడుతప్ప తక్కినవారికి విబడినట్లుండవలె. దీనిని మాటాడే పాత్ర, మాటలు వినకూడని పాత్రవైపు త్రిపతాక హస్తము పెట్టవలె.

శాకుంతలం తృతీయాంకంలో శకుంతల చెలికత్తెలు ఆమె మన్మధావస్థను గురించి మాటాడుకొంటారు. వారి సంభాషణ శకుంతల చెవిని పడకూడరు. అందుకని శకుంతల వైపు త్రిపతాక హస్తముపట్టి మాటాడుకొంటారు. ఈ సంకేతాన్నిబట్టి ఆమాటలు శకుంతల చెనిని పడలేదని ప్రేక్షకులు భావించవలె.

ఆకాశ భాషితము

రంగస్థలం మీద పాత్ర నెపధ్యంలోని పాత్రతో "ఏమనుచున్నావు ఇట్లానా" అని అతని వాచికముకూడా తానే పఠిస్తూ సల్లాపము సాగించడం.

పతాకస్థాపకము

పతాకస్థాపకము పాశ్చాత్యులు నాటకీయవ్యంగ్యంలోని వాచికప్రభేదమే.