4. అంకముఖము (అంకాన్యము)
రాబోయే అంకవిషయాన్ని ఒక అంకంచివర పాత్ర సూచించడం అంకాన్యము లేదా అంకముంఖము.
ఉదా|| శాకుంతలం పంచమాంకంచివర రాజు-
"ఏ నిరాకరించిన తావసేంద్రసుతను
దారముగ నెంతమాత్రంబు దలప నేను :
డెందమట్లయ్య సంకావ మెందుదుచివుడు
ప్రత్యయము పుట్ట బోధించు నగిదినుండె."
అని రాబోయేఅంకంలో రాజుకు శకుంతల స్మృతికిరావడం, సంతాపము సూచిక మయినవి.
5.అంకావతారము
ఒక అంకంచివర సూచించిన విధంగా ఉత్తరాంకంలో ఆ పాత్రే ఆ సూచన కనుగుణంగా కధ నడిపితే అంకంనుంచి అవతరించినట్టు కనిపించడం అలంకారము. శాకుంతలం పంచమాంకంలోని సూచనను అందిపుచ్చుకొని రాజు షష్టాంక ప్రారంభంలో ఇట్లా అంటాడు-
"మిగుల హరిణాక్షిచే మున్నుమేలుకొలుప
బడియు నిద్రించుచుండె నీ పాడుమనసు
ఘనదురంత పశ్చాత్తాప మనుభవించు
కొఱకు మేల్కొనియున్నది కోరియిపుడు."
ఈ భావము ఆ సూచననుంచి అవతరించినట్టు అనిపిస్తుంది.
పైన పేర్కొన్నవి సూచన లేదా నీరస విభాగాలకు చెందినవి. ఇక దృశ్య విభాగంలో పొందుపరచడానికి ఉపయుక్తమయ్యే కొన్ని పరికరాలను తెలుసుకొందాము. వీటిని నాట్యోక్తులంటారు.
స్వగరము
పాత్ర మనోభావాలను, ఆలోచనలను, తర్కవితర్కాలను ప్రేక్షకులకు మాత్రమే తెలియజేఉయడానికి ఉపయోగించే సాధన స్వగరము. దీనినే "ఆత్మగత" మని, "తనలో" అని కూడా అంటారు. శాకుంతలం ప్రధమాంకంలో రాజు శకుంతల సఖులకు తన ఉంగరమిచ్చిన తరవాత శకుంతల