ఈ పుట ఆమోదించబడ్డది


ఇంతవరకు పాశ్చాత్యరూపక రచనావిధానము పరిశీలించినాము. ఇప్పుడు సంస్కృత రూపకరచనా విధానము పరిశీలింతాము.

1.అధికారికేతివృత్తము: రూపకప్రారంభంనుంచి చివరివరకు వ్యాపించిన ప్రధానక్రియ. అంటే ఇదే కధానాయకుని చరితము.

ఉదా|| మృచ్చకటికలో వసంతసేనా వసవదత్తూలకధ: శాకుంతలంలో శకుంతలా దుష్యంతుల కధ: ప్రతాపరుద్రీయంలో ప్రతాపరుద్రునికధ.

2.ప్రాసంగికేతివృత్తము: ప్రధానకధలో సందర్భవశాత్తూ వచ్చి నాటకప్రధానక్రియకు సహాయపడే ఉపకధ ప్రాసంగికేతివృత్తము. ఇద్ తిరిగి రెండువిధాలు - 1. ప్రధానకధకు తోడ్పడుతూ తన ప్రయోజనము సాధించుకొని రూపకం చివరివరకు కాని, చాలా దూరంవరకు కాని వ్యాపించిఉండెది 'పతాక '.

ఉదా|| మృచ్చకటికలో ఆర్యకుని కధ: ప్రతాపరుద్రీయంలో వల్లీఖాన్ కధ.

ప్రధానకధ మధ్యలోనే అంతమయ్యే ఉపకధ ప్రకరి. ఉదా|| మృచ్చకటికలో శర్విలకునికధ: శాకుంతలంలో ఉంగరం వృత్తాంతము.

ప్రతికధకు మంచో చెడో ఫలితము ఉండకతప్పదు. ఆ ఫలితము సాధించింది ఎవరైనా, దాన్ని అనుభవించినవాడే కధానాయకుడ్ని సంసృత లాక్షణికుల సిద్ధాంతము. ఆ సాధనలో నాయకునికి తోడ్పడిన వానిని నాయక సహాయకుడు లేదా ఉపనాయకుడు అని అంటారు. అధికారికేతివృత్తానికి ఫలలోక్త నాయకుడైనట్టే సాధారణంగా ప్రాసంగికేతివృత్తానికి ఉపనాయకుడు నాయకుడు.