ఈ పుట ఆమోదించబడ్డది

సంస్కృత రూపకలక్షణాలు

అనిమరికొందరు పేర్కొన్నారు. ఇవికాక నాటకాదులను జన్యరూపకాలుగా పేర్కొన్నారు. ముఖ్యమైనవాటి లక్షణాలను కింద పేర్కొనడం జరిగింది.

నాటిక; కల్పితేతివృత్తము, దీరలలితుడు నాయకుడు, శృంగారము ప్రధానరసము. నాలుగు అంకాలు, సంగీత నృత్యవిధ్యార్ధిని కానీ, రాణి బందువుకానీ నాయిక, ఈ నాయికా నాయకులు ఒకరినొకరు ప్రేమించుకోవడం వారి సమాగమానికి అడ్డంకులు రావడం. తుదకు నాయిక పట్టపురాణికి బందువు అని తేలడం, రాణి రాజుకు పరిణయము చేయడం కధావస్తువు. ఇట్లాకధనంతా లాక్షణికులే నిబందించడంవల్ల నాటికలన్నీ పోతపోసినట్లే ఉంటున్నాయి.

ఉదా|| రత్నావళి, విద్ధసాలభంజిక.

త్రోటకము: శృంగారము ప్రదానరసము. దివ్యాదివ్యులు నాయికా నాయకులు. 5,7,8,9 అంకాలు, ప్రతి అంకంలొను విదూషకుడు ఉంటాడు.

దివ్యమానుసషసంయోగము ముఖ్యమైన లక్షణము.

ఉదా|| విక్రమోర్వశీయము, మేనకావహుషము.

నాట్యరాసకము: ఏకాంక కల్పితేతివృత్తము, దీరోదాత్తనాయకుడు. శృంగారరస ప్రధానము. నాయిక వానకనజ్జిక.

ఉదా|| నర్మవతి, విలాసవతి.

నట్టకము: అద్భుతరస ప్రధానము. ప్రాకృతభాషామయము. నాలుగు అంకాలు, వీటికి జవనికలని పేరు. ఉదా|| కర్పూరమంజరి.

హల్లీపకము: ఏకాంకము ఒకేఒక పురుషపాత్ర. 7,8,10 వరకు స్త్రీ పాత్రలు, తాళలయభూయిష్టము. ఉదా|| కేళీరై వతకము.

శ్రీగరితము: ఏకాంకము. ప్రఖ్యాత ఉదాత్తనాయకము. ప్రసిద్ధ నాయిక. ఉదా|| కృఈడారసాతలము.

కొన్ని ఆదునికరూపాలు

పైనపేర్కొన్న రూపక, ఉపరూపక రూపాలన్నీ ప్రాచీన సంస్కృత లాక్షణికులు పేర్కొన్నవి. ఇటీవలి కాలంలో మరికొన్నిరూపాలు ప్రసిద్ధికి వచ్చాయి. అందులో ముఖ్యమైనది ఏకాంకిక.

ఏకాంకిక: ఒకేఒక అంకము, ఒకేఒక వస్తువు, ఒకేఒక లక్ష్యము, ఒకగంట కాలానికి మించని ప్రదర్శనకాలము-ఇవి ఏకాంకిక ప్రదానలక్షణాలు.