రసములు
రసములు తొమ్మిది అని సంస్కృతాలంకారికులు సిద్ధాంతీకరించినారు. అని-శృంగార, హసస్య, కరుణ, వీర, రౌద్ర, భయానక, భీభత్స, అద్భుత, శాంతములు.
స్త్రీపురుషుల అన్యోన్యప్రేమానుబూతి శృంగారరసము. ఈరస్దము రెండువిధాలు. సంభోగశృంగారము, వియోగశృంగారము, నాయికానాయకుల అన్యోన్యసుఖానుభవము సంభోగశృంగారము. నాయికానాయకులకు ఎడబాటు వ్లన కలిగిన పరితాపము విప్రలంభ శృంగారము. శృంగారరసానికి స్థాయి భావము రతి.
వికృతాకారవేషభాషాచేష్టల మూలంగా జనించేది హాస్యరసము, మనస్సులో జనించిన ఆనందానికి బాహ్యరూపమే హాసము. ఇది రెండువిధాలు- ఆత్మస్థము, పరస్థము. తానే నవ్వితే ఆత్మస్థము: ఇరతులను నవ్విస్తే పరస్థము.
ఇష్టజనవినాశంవల్ల, అనిష్టప్రాప్తివల్ల జనింఛే శోకము కరుణరసము. ఈరసంలో ఇంకొకబేదము కరుణవిప్రలంభము. కరుణరసంలో నాయికా నాయకులకు తిరిగికలునుకొనే అవకాశము ఉండదు; కాని కరుణవిప్రలంభంలో ఆ అవకాశము ఉంటుంది.
ఉత్సాహము స్థాయిభావంగా గల రసము వీరరసము. ఇది నాలుగు విధాలు: దానవీరము, ధర్మవీరము, యుద్ధవీరము, దయావీరము. అర్ధిజనులు అడిగినది దానము చేయడం దానవీరము. ధర్మరక్షణ ధర్మవీరము. యుద్ధబూమిలొ శత్రువును ఎదుర్కొని పోరాడడం యుద్ధవీరము. ప్రమాదంలో ఉన్న ఆర్తులను రక్షించడం దయావీరము.
శత్రుచేష్టాజనితక్రోధము స్థాయిభావంగా గల రసము రౌద్రరసము. వికృతరూపశబ్ధాల దర్శన శ్రవణాలవల్ల కలిగే భయము భయానక రసము.
రోతపుట్టించే పస్తుప్రదర్శనంవల్ల కలిగే జుగుప్స భీభత్సరసము.
ఆశ్చర్యము కలిగించే వస్తు దర్శనమువల్ల కలిగే విస్మయము అద్భుతరసము.
ప్రశాంతత లేదా క్షమస్థాయిభావంగా గలది శాంతరసము.
తల్లిదండ్రులకు లేదా క్షమ స్థాయిభావంగా గలది శాంతరసము.
తల్లిదండ్రులకు పుత్రులమీద, అన్నకు తమ్మునిమీద, గురువుకు శిష్యునిమీద ఉండేప్రేమను వాత్సల్యరసమని; దైవ గురువృద్ధజనులమీది
సత్