ఈ పుట ఆమోదించబడ్డది

నాయికాలక్షణము

ధీరలలితుడు: పరిపాలనభారాన్ని మంత్రులమీద ఉంచి నిర్విచారంగా గాననృత్యాదికళలలో ఆసక్తుడై, శృంగారప్రధానంగా జీవితము గడిపే సుకుమారహృదయుడు. ఉదా|| వత్సరాజు, అగ్నిమిత్రుడు.

ధీరోద్ధతుడు: అమితదర్పము, శౌర్ల్యము, ఆత్మస్తుతిపరాయణత్వము, అసహనము, చంచలవృత్తి, కాపట్యము, అహంకారము కలవాడు, ఉదా|| రావణుడు, దుర్యోధనుడు.

సామాన్యంగా ఈధీరోద్ధతుడే ప్రతినాయకుడు.

ధీరశాంతుడు: వినయము, దయ, సత్యము, శౌచము మొదలైన సద్గుణాలు కలిగిన విప్ర, వైశ్య, చచివాదులు ధీరశాంతనాయకులు. వీరే 'ప్రకరణ ' నాయకులు, ఉదా|| చారుదత్తుడు, బిల్వమంగళుడు.

నాయికాలక్షణము

నాయిక అంటే రూపకంలోని ప్రధాన స్త్రీపాత్ర, నాయకుని సామాన్య గుణరాశి ఈమెకూ వర్తిస్తుంది. నాయికలు మూడువిధాలు--1.స్వీయ, 2.పరకీయ, 3.సామాన్య.

అగ్నిసాక్షిగా వివాహమాడిన స్త్రీ స్వీయ, ఇరరుని భార్య, కన్య పరకీయులు, కళానైపుణ్యంగల వేశ్వ సామాన్య. ఈమె ప్రకరణంలో నాయిక, శృంగారావస్థకు సంబందించిన నాయికలు ఎనిమిదివిధాలు:

1.అనుకూలుడగు భర్త లాలింపగా సంతసింఛే నాయిక స్వాధీనపతిక.

2.భర్త వచ్చేవేళకు తాని అలంకరించుకొని ప్రీతితో శయ్య సవరించే నాహిక వాసకస్జ్జిక.

3.భర్త రావడం ఆలస్యమైతే చింతించేనాయిక విరహోత్కంఠిత.

4.చెప్పినవేళకు ప్రియుడు రాక వంచించితే వికలమనస్కురాలైన నాయిక పిప్రలబ్ది.

5.ఇంకొకస్త్రీని కలిసిన చిహ్నాలతో ఇంటికి వచ్చిన భర్తను చూచి ఈర్ష్య పడేది ఖండిత.

6. కోపంతో ముందు భర్తను తిరస్కరించి, ఆ రతవాత పశ్చాత్తాపపడేది కలహాంతరిత.

7 భర్త దేశాంతరంలో ఉన్నది ప్రోషితభర్తృక.