ఎదిక్ నాటకరంగము
నారు. మానవుడు ప్రస్తుత: ఉత్తమత్వాన్ని సాధించడానికి ప్రయత్నించే వ్యక్తి అనీ, అట్టి మనస్తత్వానికి ఈ యుగము భిన్నంగా ఉన్నదనీ, తనచుట్టూ ఉన్న బలిష్టమైన యాంత్రికశక్తులపై పోరాడుతూ మానవుడు విధికి లొంగిపోతున్నాడనీ వీరివాదము. ప్రేక్షకుల అంతరాంతరాలలో మానవుని గురించిన యీ నినాన్ని విప్పిచ్దెప్పి, అతనిలొ అనుభూతులను కలిగించి, తద్వారా మానవునిలోను, సమాజంలోను మార్పుతీసుకొని రావలెనని ఈ రచయితలు ఆశించినారు. వీరిలో ఎర్ నెస్ట్ టోలర్, జార్జి కెయిజర్, కారెల్ కాపెక్ ముఖ్యులు. ప్రఖ్యాత అమెరికన్ నాటకకర్తలు యాజిక్ ఓనల్, ఎల్మర్ రై స్ లుకూడా ఈ పద్ధతిలో కొన్ని ప్రఖ్య్హాత నాటకాలు వ్రాసినారు.
ఈ కొవకుచెందిన రచనలలో- The Dream Play (స్ట్రిండ్ బర్గ్), Man and the masses (కెయిజర్), R.U.R (కాపెక్), From Morn to Midnight (కెయిజర్), The Adding Macine (ఎల్మర్ రైస్), This Hairy Ape (ఓనీల్) ముఖ్యమైనవి.
ఎపిక్ నాటకరంగము (Epic Theatre)
బెర్టాల్ట్ బ్రహ్ట్ జర్మనీలో ప్రారంబించిన కొత్త నాటకోద్యమాన్ని ఎపిక్ నాటకరంగము (ఉద్యమము)అంటారు. ఇంతవరకు వచ్చిన నాటకాలన్నీ నాటకీయాల లైనవనీ, తన నాటకాలు వాటికి భిన్నంగా కావ్యశిల్పాన్ని అనుసరించి వ్రసినవనీ ఆయన ఉద్దేశము. పూర్వనాటకాలలో ప్రేక్షకుడు కేవలము తనముందు ప్రదర్శించుతున్న ప్రదర్శనను చూసే వ్యక్తిగానే గుర్చింపబడినారని, చూపబడుతున్న సంఘటనలు ఎట్టిమార్పులు లేకుండా ఉన్నవని-ఉదాహరనకు చారిత్రకసంఘటనలు ఈ కాలపు స్థితిగతులకు అనుగుణంగా చిత్రించబడుతున్నవని--ఈమార్పులేని సంఘటనల ప్రదర్శనలలొ ప్రేక్షకునకు ఎట్తి పాత్రనిర్దేశింపబడలేదనీ భావించిన బ్రెహ్డ్ తన నాటకాల ద్వారా ఈ లొపాలను పూరిందే ప్రయత్నము చేసినాడు.
తాను ఊహించిన ఈ కొత్తపద్దతిలొ ప్రేక్షకుడు ఒక ప్రధానమైన భూమికను ధరిస్తాడు. ఈ మార్పును సాధించడానికి నాటకప్రయోగపద్దతులను కూడా మార్చడం అవసరమని భావించినాడు బృహ్డ్.
స్వభవ వాదులకువలె యధార్ధసంఘటనలను వాస్తవికంగా చిత్రించకూడదని బ్రెహ్డ్ వాదము. దాని స్థానే, యధార్ధ సంఘటనలనుకూడా "విచిత్ర