ఈ పుట ఆమోదించబడ్డది

ఆధునిక నాటకరంగము

ప్రతీకరూపకత్రలు వాస్తవికరూపకర్తలవలె యధార్థజీవితాన్ని తమ నాటకాలకు ఇతివృత్తంగా స్వీకరించలేరు. వారు ముఖ్యంగా గతాన్ని స్వేకరించి తద్వారా సార్వజనీనమైన సత్యాన్ని ప్రచురించడానికి పూనుకొన్నారు. ప్రతీకరూపకరచయితలలో ప్రముఖుడు మారిస్ మాటర్ లింక్, ఆయన వ్రాసిన "పెలియాస్ అండ్ మెలిశాండ్" ఈ కోవలో ముఖ్యమైన నాటకము.

ప్రతీకరూపకోద్యమము ముఖ్యంగా సాగ్నర్ సంగీతరూపకాలద్వారా ప్రభావితమైంది. ఈ కోవకు చెందిన నాటకసిద్ధాంతప్రవర్తకులు ఆడాల్ప్ అప్పియ, గోర్ధన్ క్రెయిగ్ లు.

అభివ్యక్తివాదము (Expressionism)

స్వభావ వాదానికి ముఖ్యమైన తిరుగుబాటు అభివ్యక్తి వాదంలో కన్పిస్తుంది. ఈ వాదలక్షణాలు జర్మనీలో 1910 ప్రాంతాల ప్రారంభమైనవి. అదీ చిత్రలేకనంవంటి కళలలో వాన్ గో, గోగిన్ ల కళాఖండాలకు ఈ పదము మొట్టమొదట ప్రయుక్తమయింది. నాల్కర్ హెజెస్ క్లెవర్ వ్రాసిన The Sun (1914) అనే నాటక మీపద్దతికి చెందిన మొదటినాటకము. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో ఏంతోప్రచారంలో ఉన్న ఈ విధానము 1925 కాలానికి కళారంగంనుంచి నిష్క్రమించినది.

వాస్తవికతను ఆత్మపరంగా దర్శించి, దానిని వ్యక్తికరింఛే విధానాన్ని అబివ్యక్తివారమంటారు. అందువల్లెనే మానవుల మనస్సుల అంతరాంతరాలలో ఉండే సత్యాన్ని పరిశోధించి వ్యక్తీకరించవలనన్నది ఈవాదాన్ని అనుసరించిన రచయితల అభీలాష. అంతరాంతరాలలో ఉండే సత్యము, వాస్తవంగా పైకి కనిపించే సత్యము భిన్నమై ఉండవచ్చు; ఒక్కొక్కప్పుడు రెండూ పరస్పరము వ్యతిరేకంగా ఉండవచ్చు.

మానసికమైన సత్యాన్ని వ్యక్తీకరించవలననుకొనే ఆత్మవ్యక్తీకరణ నాటకకర్త వస్తువుల వాస్తవికతను త్రోసిపుచ్చుతాడు. పొడిపొడి మాటలను సంభాషణలుగా వాడతరు. కొన్ని ప్రతీకలను ప్రయుక్తముచేయడంద్వారా పాత్రల వాస్తవికతంకు అబ్యంతరము కలిగిస్తాడు.

ఈ రచయితలు ముఖ్యంగా మానవునిగురించి, ఈ శాస్త్రయుగంలొ, ఈ యాంత్రికయుగంలో అతడు విధికి బలిఅయి పోవడాన్ని గురించి వర్ణించి