ఈ పుట ఆమోదించబడ్డది

ఇబ్బన్

వ్రాయవలెనని సిద్ధాంతీకరించడం జరిగింది. అంతేకాదు, నాటకకర్త సాధ్యమైనంత వరకు ఆత్మాశ్రయతను (Subjectivity) తోసిపుచ్చి, పరాశ్రయమైన (Objective) విధంగానే రచన చేయవలెననడం కూడా ఆమోదించబడింది.

ఈ సూత్రాలను అనుసరించే నాటకకర్తలు సమకాలీనసమాజాన్ని చిత్రించడం ప్రారంభించినారు. ఈ వాస్తవిక చిత్రణ కాల్పనికచిత్రణలో లేని నిజాన్ని వెల్లడిస్తుందినీ, అట్టి నిజాన్ని గ్రహించినప్పుడు ఈ ప్రపంచంలోని లోటుపాట్లను గ్రహించి వాటి నివారణకు కృషిచేసే అవకాశము ఉంటుందనీ ఈ స్వభావవాదుల వాదన.

ఈయాధార్ధచిత్రణము కషాస్వీకరణంతో ప్రారంభమై, రానురాను పాత్రచిత్రణంలో, రంగాలంకరణలో, నటనలో పరిపూర్ణతను పొందింది. ఈ విధమైన యధార్ధ చిత్రణము ఫ్రాన్సులో యాజిన్ స్త్రిట్, అలెగ్నాండర్ డ్యూమాలతో ప్ర్రారంబమై, నార్వేకు చెందిన ఇల్సన్ లో పరాకాష్టకు చేరింది.

ఇభ్సన్

ఆధునికనాటకచరిత్రలో ఇబ్సన్ (1828-19-06) కు ఒక విశిష్టమైన స్థానమున్నది. నాటకచరిత్రగతిని ఆకాశంలో విహరించే కాల్పనిక గాధలనుంచి భూమిమీదకు తీసుకొనివచ్చి యధార్ధచిత్రణకు కావ్యత్వము కల్పించిన భగీరధుడాయన. ఈయన వ్రాసిన Pillars of Society, A Doll's House, ghosts, An Enemy of the People, The Wild Duck వంటి నాటకాలలో సామాజికసమస్యలను ప్రతిభావంతంగా చిత్రించినాడు. తన నాటకంలోని ప్రతి ముఖ్యమైన పాత్రను తాను చెప్పదల్చుకొన్న మూలసూత్రానికి అనుసంధావించడం, తద్వారా పాత్రలకు, తచయిత మనోభావాలను ఆవినాభావ సంబంధాన్ని సాధించడంఅ ఇబ్సన్ శిల్పంలోని ప్రాధమిమతత్త్వము. స్వబావసిద్ధమైన మాటలు, చేతలు, పాత్రగతమైన స్వభావాన్ని వెల్లడిపచేయడం కూడా ఇబ్సన్ శిల్పం లోని ముఖ్యలక్షణము. ప్రతిపాత్రవనక తగిన సామాజికవాతావరణాన్ని చిత్రించినాదు ఇబ్సన్.

అంతకుముందే ప్రసిధమైఉన్న 'Well-made play' ను స్వీకరించి అందులోని స్వగతాలను, పాత్రలు రహస్యస్థలాలో దాగి కనబడకుండా సంభాషణలను పొంచి వినడంవంటి పద్ధతులను త్యజించి నాటకరచనలో స్వాబావికమైన లక్షణాలను ప్రవేశపెట్టినాడు ఇబ్సన్. చివరిరోజులలో వ్రాసిన