ఈ పుట ఆమోదించబడ్డది



కొన్ని వాదాలు

వాస్తవికతా వాదము (Realism)

పందొమ్మిదవశతాబ్ధము మధ్యభాగానికి, అంతవరకు ప్రబలంగా ఉంటూ వచ్చిన కాల్పనికోధ్యమము (Romanticism) మెల్లగా అదృశ్యము కావడం ప్రారంభించించి. స్వాతంత్ర్యము, సమానత్వము, సౌభ్రాత్రము వంటి ఆదర్శబావాల స్థానంలో ప్రపంచంలోని అశేషమైన పీడిత ప్రజల సమస్యలు ప్రధానమైనాయి. ఈమార్పుకు పారిశ్రామిక విప్లవము మొదటి కారణము. ఈకాలంలోనే ఆగస్టస్ కామ్టే వంటి సాంఘికశాస్త్రవేత్తలు సమాజశ్రేయస్సును ప్రాధమిక సూత్రంగా భావించి దానిని సాధించడానికి శాస్త్రీయమైన దృక్పధాన్ని అలవరచుకొవలెనన్న సిద్ధాంతాలను ప్రపంచించినారు. వీటికి డార్విన్ సిద్ధాంతము తోడైనది. వీటిఅన్నీంటి వల్ల సమాజశ్రేయస్సు కోసము శాస్త్రీయమైన, సత్యదూరముకాని ఒకవిధానాన్ని అవలంబించడం తప్పనిసరి అయింది. పంచేద్రియాల అనుభవానికి అందేదే నిజమైన సత్యమని, అట్టి సత్యాన్ని గ్రహించి దానికి అనుగుణంగా మానజీవితాన్ని తీర్చిదిద్దుకొవడమే మానవుల మనుగడకు అవశ్యకమని ఈ కొత్తతరము సిద్ధాంతీకరించు కొన్నది. ఇది సాహిత్యంలో వచ్చిన వాస్తవిక వాదానికి మూలరూపము.

రంగస్థలం మీద వాస్తవికవాదం

1850 నాటికి స్వభావవాదము కళారంగంలో ప్రముఖమైనసిద్ధాంతంగా రూపొందింది. 1860 నాటికి ఫ్రెంచినాటకకర్తలు దీనిని తమ నాటకాలకు కూడా అనువర్తింపచేసినారు. దీనిని అనుస్రించినాటకకర్త వాస్తవిక ప్రపంచాన్ని గురించి యధార్ధమైన వర్ణన చేయవలెననీ, అట్టి యధార్ధ వర్ణన వ్యక్తిగరమైన పరిశీలన మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి తన అనుభవానికి అందుబాటులోఉన్న, తన చుట్టూ సమాజాన్ని గురించి మాత్రమే