ఈ పుట ఆమోదించబడ్డది

మూక రూపకము

పాశ్చాత్యదేశాలలో 'panton.ime' అనే పదము వివిధ కాలాలో విభిన్నమైన అర్ధాలలో వాడబదినది. అన్నింటిలోను ముఖ్యమైన లక్షణము వాచికము లోపించడమే! ఇటలీలోని పెద్ద నాటకశాలలలోని వేలాది ప్రేక్షకులకు వాచికము సరిగా వినబడదనే ఉద్ద్యేశ్యంతో కేవలము మూకాభినయాన్నే ప్రధానంగా గ్రహించి రూపకాలను ప్రదర్శించడం ప్రారంభించినారని చరిత్రకారుల అభిప్రాయము.

ఇటలీలోని మూకాభినయాలకు మూలము కరాళ (Masks) రూపకాలు.

వాచిక ప్రధానమైన రూపకాలు ప్రారంభము కావటంతో మూక రూపకాల ప్రదర్శనము వెనుకపడినది. అయినా ఇప్పటికీ క్రిస్ మస్ సమయంలో మూకరూపకాలు ప్రదర్శింపబడుతూనే ఉంటాయి.

కేరళ 'కధాకళి ' మూకరూపకానికి చక్కని ఉదాహరణ. ఇందులో నేపధ్య గద్యపద్యాత్మక వాచికానికి, జంత్రవాద్యాలకు అనుగుణంగా వాచికార్ధాన్ని అంగనివ్యాసంద్వారా నటులు వుయక్తీకరిస్తారు.

తెలుగులో తోలుబొమ్మల, కట్టెబొమ్మల ప్రదర్శనాలలో మాటలుండవు. నేపధ్యంలోనుంచి వాచికము చదవబడుతుంది. కాని ఇందులో ఆడే బొమ్మలు నిర్జీవ ప్రతిమలు కాబట్టి వీటిని మూకరూపకాలుగా పరితణించడంలేదు. ఇటీవల వెలువడిన అనిసెట్టి సుబ్బారావు 'శాంతి ', గిడుతూరి సూర్యం 'మానవుడు ' తెలుగులో వచ్చిన మూకరూపకాలు.

వాచిక ప్రధానమైన నాటకాలలోకూడా మూకాభినయము విశిష్టమైన పాత్ర వహిస్తుంది. ఒక పాత్రభాషణము జరుగుతూఉండగా, ఇతరపత్రలు మూకాభినయం ద్వారా ఆ భాషణకు ప్రతిచలనము చూపుతారు. ఈమూకాభినయాన్నే ('Silent action') అని, దానికి విశిష్టస్థాన మిస్తున్నాము. ఈ మూకాభినయము ఒరిపిడిరాయిగా నటుని సామర్ధ్యాన్ని పరీక్షిస్తారు.