రూపక భేదాలు
కులను తప్పతాగి తూలుతూ, పాటలు పాడుతూ ప్రవేశించే తాగుబోతులుగ రూపొందించినారు. సాధారణంగా ఈరకం నాటకాలు వ్యక్తుల అదృష్టదురదృస్థాలను చిత్రిస్తూంటాయి. రంగస్థలంమీద ఒకరిమాట ఒకరికి వినబడనట్టుగా వ్యవహరించే సంప్రదాయము ఈ నాటకాలలోనే ప్రారంభమయించి.
అరిస్టాటిల్ కామెడీ ఇట్లా లక్షణము చెప్పినాడు. "బాధాకరము వినాశకరముగాని, ఏదొ ఒక లోపమును లేదా అసహ్యకరమగు విషయమును ప్రతిపాదించి మానవుని నిత్యజీవితమందలి వ్యక్తులకంటె అధమునిగా చిత్రంచెడి మామెడీ"1 --డా.పి.యస్.ఆర్. అప్పారావు అనువాదము.
కామెడీకి మచ్చుతునకలు
అరిస్టోఫేన్సు (Aristophanes): కప్పలు(Frogs) తూనీగలు (Wasps), పార్మమెంటులో స్త్రీలు (Women in Parliament).
మెనాండర్ (Menander), హీరో(Hero), సామియా(Samia), పెర్సిరోమిన్ (Peru Romin)
రోమన్ ఆహ్లాదరూపకము (Roman Comedy)
ప్రాచీన గ్రీకు ఆహ్లాద నాటకాల ఒరవడినే వెలువదినవి - రోమన్ ఆహ్లాద రూపకాలు, వీటిలోని పాత్రలు సాధారణంగా వ్యక్తులకుగాక జాతులకు (Type;) ప్రతీకలు, లోభులు, దుబారా ఖర్చుచేసే వ్యక్తులు, పిరికిపందలు, తంత్రాలుపన్నే బానిసలు, అసూయాపరలైన భార్యలు, డప్పలుకొట్టే నావికాధికారులు, కుంటెనకత్తెలు వంటివారు ఆహ్లాదరూపకాలలోని దూఢిపాత్రలు (Stock characters).
రోమన్ నాటకాలలోని స్త్రీ పాత్రలు ప్రత్యక్షంగా గౌరవకుటుంబాలకు చెందినవారుగాక వేశ్యలొ, గౌరవకుటుంబంలో పుట్టి దురదృష్టవశాత్తూ చిన్న తనంలోనే తప్పిపోయి, సామాన్య కుటుంబంలోనో, బానిసలుగానో పెరిగిన కన్యలో అయిఉంటారు. రోమన్ ఆహ్లాదనాటకాలలోని కధాసరళి సామాన్యంగా ఇట్లా ఉంటుంది- ఒక యువకుడు ఒక బానిసబాలికను ప్రేమిస్తాడు. ఆబాలికను కొని వివాహమాడటానికి సొమ్ము కావలె. ఆ సొమ్ము సంపాదించడానికి నౌకరు
1."Comedy is, as we have said, an initiation of characters of a lower type......it consists in some defect or ugliness which is not painful or destructive."