ఈ పుట ఆమోదించబడ్డది

విషాదరూపకము

కళాత్మకాలైన భాషాలంకారాలతో అలంకరింపబడి, కధనాత్మకంగా క్రియాత్మకమైన శొకభయాల మూలంగా ఆయా ఉద్వేగాలకు ఉచితమైన క్షాళన కలిగించేది ట్రాజెడీ".

దీనినిబట్టి అరిస్టాటిల్ ట్రాజెడీకి ఆరు అంగాలను చెప్పినాడని స్పష్టమవుతున్నది--1.ఇరివృత్తము, 2.పాత్రచిత్రణము, 3.శైలి, 4.చింతన, 5.దృశ్యము 6.గేయము.

నాయకుని మృతితో విషాదరూపక మంతముకావలెనని అరిస్టాటిల్ నియమము పెట్టలేదు. కాని ఆచరణలో మాత్రము రచయితలు నాయకుని మృతితో విషాద నాటకాలను అంతము చేసినారు. దానిని పురక్సరించుకొని నాయకుని మృతి ఒక నియమంగా విషాదరూపకాన్ని లాక్షణికులు ఇట్లా నిర్వచించినారు. "ఉన్నతస్థితిలోని మానవుని మృతికి దారితీసే అపూర్వవిపత్తుతో కూడిన కధ లేదా అపూర్వవిపత్తును కొనితెచ్చే మానవ క్రియలు. ఆమానవుని మృతితో అంతమయ్యే కధ ట్రాజెడీ".2

ఈ అపూర్వవిపత్తుకు కారణము బాహ్యమైనదిగాని, అంతరమైనది గాని కావచ్చు. రెండు అధ్యాత్మిక శక్తులమధ్య, కఠిన చట్టాలకు మొండి పట్టుదలలకు మధ్య సంఘర్షణ కావచ్చు.3


1."Tragedy is an imitation of an action that is serious, complete and of a certain magnitude; in language embellished with each kind of artistic ornament, the several kinds being found in separate parts of the play; in the form of action, act of narrative, through pity and fear effecting the proper purgation (catharsis) of the emotions." --"Poetics" Ch. 6, Bucher's Translation.

2. "A tragedy is a story of exceptional calamity leading to the death of man in high estate or the story is one of human actions producing exceptional calamity and ending with the death of such a man." --A.C.Bradley, "shakespearean Tragedy," Pp 1--2.

3."The Calamity is due to conflict --external, internal--between spiritual forces, between iron laws and stubborn will" --Rhetoric Notes, Pp 77.