ఈ పుట ఆమోదించబడ్డది

ఆరంభము

సౌజన్యారావు:- (మొదట నిమగ్నుడై యోచనపై కోపావేశము కలిగి నిలిచి) ఏమి మోసము జరిగినది అంటాడు. ప్రేక్షకులు మొదట ఆశ్చర్యనిమగ్నులవుతారు. ఇంతవరకు సౌజన్యారావు, మధిరవాణి, గిరీశం మధ్య జరిగిన సంభాషణకూడా ప్రేక్షకులలో ఎంతో ఉత్సుకతను రేకెత్తిస్తుంది. ఎక్కడికక్కడ ఈ కొత్తమనిషి ఇట్లా మాటాడుతున్నాడేమని, ఈ మాటలు ఎక్కడికి దారితీస్తాయో అని ఉత్సుకత ప్రేక్షకులలో కలుగుతుంది. మరి రెండోసారి చూచినపుడు ఈ గోప్యత సమసిపోయి ఉత్సుకత రేకెత్తకపోవచ్చు.

ఇక ప్రతాపరుద్రీయంలో యుగంధరుడే పిచ్చివాన్మి రూపంలో తిరుగు తున్నాడని రచయిత సూటిగా ఎక్కడా చెప్పడు. కాని పంచమాంకంలో యుగంధరుడు ముమ్మడమ్మతో--

"కొనిపోయెనమ్మ నీప
ట్టిని యవనుడు దైవఘటన ఢిల్లీపురికిన్;
వనరకు, మేదునెలల పది
దినములలో దెచ్చియిత్తు దేవీ నీకుర్ 1

అనిచెప్పడం, ఆ తరవాత ఢిలీ వీధులలో "ఢిలీసుల్తాను పట్ట్లుకుపోతాన్, మూడే నెల్లాకు పట్తుకుపోతాన్" అని అరిచేసరికి ఈ పిచ్చివాడే యుగంధరుడని ప్రేక్షకులు పసిగట్టేస్తారు. అందుచేత పిచ్చివాడు యుగంధరునిగా మారినఫ్ఫుడు ప్రేక్షకులలో అంత పెద్దగా విస్మయము కలుగరు. అయితే ఈ పిచ్చివాడు ఢిల్లీ సుల్తాన్ ఎట్లా పట్తుకొనిపోతాడు! అనే ఉత్సుకత మాత్రము ప్రేక్షకులలో కొనసాగుతూనే ఉంటుంది. ఇదంతా మొదటి ప్రదర్శనవరకే!

ప్రతిజ్ఞాయౌగంధరాయణంలో, స్వప్నవాసవదత్తలో యౌగంధరాయణాదులు మారువేషాలలో ఉన్నారని భాసుడు ప్రేక్షకులకు సూటిగా తెలియచేసినాడు.

అపరాధపరిశోధక నాటకాలలోకూడ సి.ఐ.డి పాత్రలు మారువేషంలో తిరుగుతూ ఉంటారు. లేదా ఫలానా అతడు సి.ఐ.డి అని పాత్రలకు, ప్రేక్షకు


1.వేదం వేంకటరాయశాస్త్రి, "ప్రతాపరుద్రీయము" పుట.98 (ఎనిమిదవ ముద్రణ, 1947)