ఈ పుట అచ్చుదిద్దబడ్డది
12
రూపక నిర్వచనము
చించినాడు. “రూపక రచన అంటే మానవ ప్రకృతికి దర్పణము పట్టడమే !"[1] అంటే ప్రకృతికి దర్పణమే రూపకమని పిండితార్థము. ఈ భావాన్నే జాన్ డై డెన్ (John Dryden) ఇట్లా వివరించినాడు “రూపకము మానవ పకృతికి సరిఅయిన, సజీవమైన ప్రతిబింబము కావలె. అది మానవ ప్రకృతిలోని ఉద్వేగాలను, చిత్తవృత్తులను, దశలలోని మార్పులను మానవాళి వినోదం కోసము, హితోపదేశంకోసము ప్రతిబింబింప చేయవలె." [2] రూపకము మానవ ప్రకృతికి ప్రతిబింబమనే భావాన్నే సంస్కృత లాక్షణికులు కూడా వెల్లడించినారు.
నానాభావోపసంపన్నం
- నానావస్థాంతరాత్మకమ్
లోక వృత్తానుకరణం
- నాట్య మేతన్మయాకృతమ్[3]
యోఽయం స్వభావో లోకస్య
- సుఖదుఃఖసమన్వితః
సోఽంగా దభినయో పేతో
- నాట్యమిత్యభిధీయతే[4]
అవస్థానుకృతి ర్నాట్యమ్.[5]
అవస్థ అంటే కేవలము భౌతికావస్థ మాత్రమేకాక , మానసికావస్థ అని కూడా చెప్పుకోవలె, ప్రతికృతి, అనుకృతి, అనుకరణ (image, representation, imitation) ఇవి సమానార్థకాలు. అవస్థలు (passions and humours)
- ↑ “To hold as it were the mirror upto nature" HAMLET, Act 3-Scene 2
- ↑ "A Plot ought to be just and lively image of human nature representing its passions and humours and image of fortunc to which it is subjected, for the delight and instruction of mankind Dryden. "An Essay on Dramatic Poesy"
- ↑ నాట్యశాస్త్రము 1-112
- ↑ నాట్యశాస్త్రము 1-119
- ↑ దశరూపకము 1--6,7