ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఈరకంగా మెరుగులు దిద్దటం పూర్తి అహిన తరవాత, రంగస్థలంమీద అన్నిపరికరాలతోను-అంటే పూర్తి దుస్తులు, ఆహార్యము (make up and constume). కాంతిప్రకాశన (lighting) లతో పూర్వాభ్యాసాలు చేయటం అవసరము, ఇట్టి పూర్వ ప్రయోగాన్ని దుస్తులతోపూర్వాభ్యాసము (dress rehearsal) అంటారు. ఇట్లాంటివి రెండుమూడు పూర్ణపూర్వాభ్యాసాలు అవసరము. దీనివల్ల ప్రదర్శనస్వరూపము బోధపడటమేగాక నటీనటులు వారుపయోగించే వస్తువులు, దుస్తులు వగైరాలకు అలవాటు పడటానికీ, లోపాలను సరిదిద్దుకోవటానికి ఎంతో ఉపయోగపడతాయి.
ఇట్లాంటి పూర్వాభ్యాసాలలో ఎన్నో లోపాలు, అనుకోని సంగతులు బయటపడటం పరిపాటి. అందుచేత దర్శకుడు నిరుత్సాహపడనక్కరలేదు. ఆందోళన అంతకన్నా అవసరము లేదు. వీటివల్ల నటీనటులు ప్రదర్శనలో మరింత హెచ్చరికగా ఉండి, ఆ లోపాలు రాకుండా జాగ్రత్తపడతారు.