స్థలంపై ఆ సమయంలో ఉన్న ఇతర నటీనటులపై రంగవ్యాపారభావప్రకటనలనుకూడా, అందుకు అనుకూలంగా రూపొందించవలె. దీర్గసంభాషణలోని, దీర్ఘ వాక్యాలను అర్ధ భావయుక్తంగా విడగొట్టి, సంభాషణలోని గమనభావాన్ని వఒవొధ్యంతో దర్శకుడు రూపొందించకపోతే. ప్రేక్ష్జకులకు విసుగుకలుగుతుంది. దీర్ఘ సంభాషణలవల్ల ఎట్టి పరిస్థితులలోనూ ప్రేక్షకుల ఆసక్తి తగ్గరాదు.
ప్రత్యేక సన్నివేశాలు, పరిస్థితులు
నాటకంలో నవ్వుల ప్రసక్తి వచ్చినప్పుడు, దర్శకుడు ఆ విషయమై ప్రత్యేక శ్రద్ధతీసుకోవలె. రచయిత నవ్వును సూచిస్తూ "హ ! హ ! హ!" అని వ్రాసినప్పుడు, నటుడు తు. చ. తప్పకుండా "హ ! హ ! హ !" అంటే చాలనుకోవటం పొరపాటు. ఆ నవ్వు ఆ సందర్బాన్నిబట్టి, పాత్ర పాత్ర ప్రకృతినిబట్టి, స్త్రీ పురుష భేదాన్నిబట్టి పాత్రల మధ్యఉంటే అంతస్తుల తేడాలనుబట్టి రూపొందవలె. రచయిత వ్రాసిన పొడిమాతలనుబట్టి నటీనటులు నవ్వులు, ఏడ్పులు సృష్టించకూడదు. ఈ రెంటిలోను దర్శకుడు 'అతి ' లేకుండా జాగ్రత్తపడితే తప్ప లేకుంటే రసభంగమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నటీనటులకు వీటి విషయమై దర్శకుడు ప్రత్యేకశిక్షణ ఇచ్చి, అవి సహజంగాను, సందర్బోచితంగాను ఉండేటట్లు జాగ్రత్త పడవలె, ప్రత్యేకమైన ముఖ్యసంభాషణలు, దీర్ఘ సంభాషణలు, నవ్వులు, ఏడ్పులు, ప్రేమ సన్నివేశాలు, కలహ సన్నివేశాలు విడిగా పూర్వాభ్యాసముచేస్తే ఫలితాలు బాగుంటాయని దర్శకుడు గమనించవలె. ఇంతచక్కని ప్రణాళిక, కార్యక్రమము రూపొందించినా, సాధారణంగా, నాటకంలోని కొన్నిభాగాలు, దర్శకునికి తృప్తికరంగా తయారవటం కష్టమవుతుంది. ఇది ప్రత్యక్షప్రేక్షక ప్రతిస్పందనలోపంవల్లనా (lack of audience response) లేదా ప్రయూగ పద్ధతులలోపంవల్లనా అనే విషయం తేల్చుకోవటం దర్శకునికి కష్టమవుతుంది. అందుచేత, చివరి పూర్వాభ్యాసాలకు కొంత మంది ప్రేక్ష్జకులను పిలవటం అవసరము. సామాన్యంగా ఉద్దేవపూరిత ఘట్టాలు, హాస్యఘట్టాలు ప్రేక్షక ప్రతిస్పందనవల్ల విజయవ్ంతాలవుతాయి. ప్రేక్షక ప్రతిస్పందన ఆధారంగా నటులు త్తేజితు లవటమేగాక, ప్రేక్షకులుండటంవల్ల వారి కృషి. దీక్ష, హెచ్చరిక మరింత ఎక్కువ అయ్యే అవకాశ మేర్పదుటుంది.
మెరుగులు దిద్దటంలో దర్శకుడు కింది విషయాలలో శ్రద్ధచూపవలె.
1.. నాటక ప్రారంభము, అంతము,