ఈ పుట ఆమోదించబడ్డది




పూర్వాభ్యాస్దము దర్శకుని అతిముఖ్యమైన వ్యక్తిగత బాధ్యత.  పూర్వభ్యాసం ముఖ్యోద్దేశాలు--

1, ప్రయోగానికి (experiment) అవకాశము కల్పించడం

2, నటీనటులకు నాటకంలోని సంభాషణలు, చలనము, అభినయము, రంగవ్యాపారము మొదలైనవాటినీ నాటకంయొక్క అంతరార్ధాన్నీ బోధించటం.

3. అన్నివిధాలా ప్రయోగాన్ని ప్రదర్శనస్థాయికి (Production) తీసుకొనిరావటం, మెరుగులు దిద్దడం.

ఔత్సాహికులు విద్యార్ధులూ, పరిపక్వముకాని విజ్ఞానము కలవారూ, అనుభవరహితులూ కావడంచేత దర్శకుడు ప్రయోగాలు (experiments) పరిమితంగా, పూర్వాభ్యాసానికి ముందో, మధ్యనో చేసుకొంటూ ఎక్కువ కాలము బోధనకూ మెరుగులు దిద్దుకోవటానికీ వినియోగించవలె.

ఏ దశనూ అశ్రద్ధచేయనవసరంలేకుండా, దర్శకుడు ముందుగానే సరిఅయిన ప్రణాళిక ప్రకారము కార్యక్రమము రూపొందిచుమొని, నటీనటులకు, సాంకేతికనిపుణులకు, సహాయకులకు తెలియజెవయలె ఈ కార్యక్రమము నాటక స్వభావాన్నిబట్టీ, దానికు అనుసరించవలసిన ప్రదర్శన పద్ధతులనుబట్టీ ఉంటుంది. తక్కువ పాత్రలతోకూడిన సన్నివేశాలు ఎక్కువగా ఉంటే, ఆ సన్నివేశాలను విడివిడిగా ఆ పాత్రలచేత చేయించి, వరసక్రమంలో పూర్వాభ్యాసం ఆఖరుదశలోచేయవచ్చు. ఇందువల్ల చిన్నపాత్రలున్న నటీనటులు అనవసరంగా రావలన పని తప్పుతుంది. అట్లాగాక, ఎక్కువ సన్నివేశాలలొ ఎక్కువ పాత్రలుంటే ఈ పద్ధతి ఆఛరణలో కష్టము. దుస్తుల ఆడంబరము ప్రాముఖ్యము వహించే నాటకాలలో దుస్తులతోకూడిన పూర్వాభ్యాసాలూ, దీపనము మొదలైన హంగుల మీద ఆధారపడే నాటకాలకు వాటితోకూడిన ల్పూర్వాభ్యాసాలూ ఎక్కువగా చేయ