ఈ పుట ఆమోదించబడ్డది

3. ఆ నాటకంతో పూర్వపరిచయము లేకపోవటం లోపంకాదని తెలియజెప్పి, అభ్యర్దులకు సంభాషణక ప్రతిని ఇచ్చి ఆ సన్నివేశాన్నిగురించి పాత్రలగురించి తెలియజెప్పి పూర్వాభ్యాసము చేయించవలె.

కదలికలు, కార్యకలాపము అభ్యర్ధులు వారికివారే ఊహించుకొని చేయవలె. ఒక్కొక్క నటుని గురించి నిర్ణయానికి వచ్చినతరవాత ఆపి, ఆ నటుని స్థానంలో, అదేపాత్రకు అభ్యర్దిఅయిన మరొకనటుని పిలిచి చేయించవలె. ఒక్కొక్కసారి అవసరంపట్ల, సందర్భోచితంగా అందరినీ ఆపివేసి, కొత్తవారిచేత తక్కిన సన్నివేసాన్ని సాగించవచ్చు. ఎన్నికచేయబడిన తక్కిన సన్నివేశసలు ఇదేపద్ధతిలో పూర్తిచేయవలె.

నటనలో అభ్యర్ధుల సాంకేతిక ప్రజ్ఞావిసేషాలను ఈ దశలో విస్మరించడం మంచిది. ఈ దశలో పరిశీలించవలచిన అంశాలు--

1. అభ్యర్ధి ప్రేక్షకులలో అనుభూతిని కలిగించగలడా (ఏమాత్రమూ ఆసక్తి కలిగించలేనివారిని నిస్సందేహంగా తీసివేయవచ్చు.)

2. నటుని శరీరనిర్మాణము పాత్రోచితంగా ఉన్నదా

3. పాత్రోచితమైన సహజప్రకృతి లక్షణాలు నటునిలో ఉన్నవా (పాత్ర విషాదప్రకృతిని సూచించేదైతే హాస్యప్రకృతి అభ్యర్థిలో కనిపిస్తున్నదా)

అభ్యర్దులందరికీ అవకాశమిచ్చి, పరిశీలన పూర్తి అయిన తరవార దర్శకుడు ఇతర సభ్యులతో సంప్రదించి, వారి భావాలను తెలుసుకొని, ఏరివేత కార్యక్రమము పూర్తి చేయవలె.

రెండవదశ

పైవిధంగా మొదటి దశలో ఏరివేత పూర్తి అయిన తరవాత మిగిలిన వారిని తిరిగి పిలవలె, ఐదారుగురుని మించి అభ్యర్ధులు ఒకే పాత్రకు మించి ఉంటే, ఆ సంఖ్యను ఇద్దరు ముగ్గురికి తగ్గించవలె. ఎట్టిసందర్భంలోనూ ఒకని కన్న బాగా చేసిన అభ్యర్ధి ఉన్నప్పుడు అతనిని పిలవరాదు. ఒకే అభ్యర్ధిని రెండు మూడు పాత్రల నిర్ణయానికి పిలవవచ్చు. కొత్త అభ్యర్ధులను చిరిగి పిలవవలె.