ఈ పుట ఆమోదించబడ్డది




పూర్వాభ్యాసము (rehearsal) మొదలు పెట్టేముందే పాత్రనిర్ణయము జరగవలె. ఈ నిర్ణయము ప్రేక్షకానుభూతిని దృష్టిలోఉంచుకొని జరగవలెనేగాని, నటులను తృప్తిపరిచేటందుకు, వారికి ఉత్సాహ ప్రోత్సాహాలిచ్చేటందుకుమాత్రముకాదని దర్శకుడు గుర్తుంచుకోవలసింది. ప్రతి పాత్రకు ఒక మంచినటుడు లభించే సందర్భంలో, పాత్రనిర్ణయము పూర్వాభ్యాసానికి చాలా ముందుగానే చేయవచ్చు.

అర్హతలు

ఒకపాత్రకు నటునిఎన్నిక, అతనికి నటనలో ఉన్న ప్రత్యేక ప్రజ్ఞా ప్రాభవాలుగాక, అతడా పాత్రకు సరిపోతాడా అనె ప్రాతిపదికమీద జరగవలె, టాళంచెవి విలువ అది కావలసిన తాళాన్ని తెరవగలశక్తి మీద ఆధారపడిఉంటుందిగాని, అది తఉయారైన లోహం విలువనుబట్టికాదు. నటుడు రంగస్థలం మీద ధరించే పాత్ర అతని బాహ్యశరీర లక్ష;ణాలకు ఇంచుమించు సరిపోయేదిగా ఉండవచ్చు (ఇది అనురూపము). లేదాభిన్నంగా ఉండవచ్చు (ఇది విరూపము). నటుడు ఆ పాత్రలో ప్రేక్షకులకు ఎట్టి అనుభూతిని కలిగించగలడు అనేది ముఖ్యము. ఎన్నిక చేయవలసినపాత్ర ముఖ్యసంభాషణలు చెబుతూ, అభినయము చేయించి, నిర్ణయించటం చక్కని మార్గము కాగలదు. కావలసిన ఫలితాలు దర్శకునికి లబిస్తాయి.

పాత్రవిర్ణయ కార్యవర్గము (casting Committee)

ఒక్కొక్క నటునివల్ల, విభిన్నమైన అభిరుచులుగల ప్రేక్షకులు విభిన్నమైన అనుభూతిని పొందుతారు. అందుచేత, దర్శకుడు కేవలము తన ఒక్కని అభిరుచి ఆధారంగా నిర్ణయాలు చేయకుండా మరికొందరి అభిప్రాయాలు సేకరించి, నిర్ణయము చేయడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి