ఉండటంవల్ల, 2. ప్రేక్షకాభిముఖంగా ఉండటంవల్ల హెచ్చుతుంది. దగ్గరగా ఉండడంకన్న, ప్రేక్షకాభిముఖంగా ఉండడమే ప్రాధాన్యాన్ని సాధించగలదు. రెండుపాత్రలు ప్రేక్షకులదృష్టికి ఒకేకోణంలో తిరిగి ఉన్నప్పుడు, దగ్గరగాఉండే పాత్ర, ఎక్కువ శక్తి ప్రాధాన్యముకలిగిన ప్రదేశంలో ఉంటుంది. కాని ఈ పాత్రకు సంభాషణ ఉన్నప్పుడు, వాస్తవికతకోసము, ప్రేక్షకులకు దూరంగాఉన్న పాత్రవైపు తిరిగి, సంభాషణ చెప్పవలసి ఉంటుంది. అప్పుడు ప్రేక్ష్జకాభిముఖంగా ఉన్నపాత్ర, సంభాషణ చెప్పేపాత్రకంటె, ఎక్కువశక్తి ప్రాధాన్యాలు కలిగిన భంగిమలో ఉంటుంది. ప్రేక్షకాభిముఖంగాను తిరోముఖంగానూ తిరగడంవల్లనే గాక, శిరస్సు పైకిఎత్తటం కిందికి దించటంబట్టికూడా ఈ శక్తి ప్రాధాన్యము మారుతుంది. (చూ.పతము 19) ఏకాంతంగా ఉండే పాత్రకూడా ఎక్కువ శక్తి, ప్రాధాన్యము కలిగిఉంటుంది. లేతవి. ప్రకాశవంతమైనవిఅయిన రంగులు ముదురు రంగులకంటె శక్తిమంతాలు.
మరుగుప్రచడం (Covering)
రంగస్థలంమీద ఒక వ్యక్తిగాని, వస్తువుగాని, మరొకవ్యక్తినిగాని, వస్తువునుగాని ప్రేక్షకుల దృష్టికి కనబడకుండా చేసినప్పుడు "మరుగుపరచడం" అంటారు. మరుగుపడిన వస్తువుగాని, వ్యక్తిగాని ప్రాముఖ్యము కోల్పోవడం జరుగుతుంది. రంగస్థలంమీద కత్తితో పొడిచి చంపడం అవసరమైనప్పుడు అందులోని రాజకీయమైన మోసము, బీభల్త్సము ప్రేక్షకుల దృష్టికి రాకుండ ఆ సన్నివేశము ఉద్దేశపూర్వకంగా మరుగుపరచడం జరుగుతుంది. ఇట్లా ఉద్దేశపూర్వకంగాచేసే సమయాలలోగాక, ఇతర సందర్భాలలో నటులూ, నటక్రియలూ మరుగుపడాకుండా దర్శకుడు జాగ్రత్త పడవలసి ఉంటుంది.
ముందు సంభాషణలు చెప్పేటప్పుడు అతనిపెదవులు ప్రేక్షక దృష్టికి కొతుక కేంద్రస్థానాలు. దర్శకుడు ఆనటునికి ఏరంగవ్యాపారమెర్పరిచినా, ఆ నటుడు భుజిస్తున్నా తాగుతున్నా, టెలిఫోన్ లొ మాటాడుతున్నా, పొగతాగుతున్నా, ఏడుస్తున్నా ఈ కేంద్రస్థానము (అనగా పెదవులు) ప్రేక్షకులకు కనిపించడం ఆత్యవసరము. (చూ.పటకులు, 20, 21) ఈ కార్యకలాపాలలో, కొన్నిలక్షణాలు ఆ కార్యకలాపానికి అవసరమైన వస్తువుగాని ప్రక్తియగాని పెదవులను మరుగుపరిచినా, సంభాషణ చెప్పేటప్పుడు విధిగా ప్రేక్షకులదృష్టికిరావలె; లేదా ఆ పరికరాలు అడ్డురాకుండా జాగ్రత్తపడవలె.