4. రంగస్గలం అడమభాగము కుదిభాగముకన్నా నిరుత్సాహాన్ని, దుష్టస్వభావాన్ని కూడా వ్యక్తము చేయవచ్చు.
ఈ అంశాలన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తే, ప్రదేశాలకు కింది లక్షణాలు ఆపాదిచవచ్చు.
1. UL ( ఎగువ ఎడమ)
ఇది దూరాన్నీ బలహీనతనూ మార్ధల్వాన్నీ సూచిస్తుంది. ప్రాముఖ్యం లేని సన్నివేశాలకు అనుకూలంగా ఉంటుంది. భయానక దృశ్యాలకుకూడా - వానిలో అంతర్గతంగా ఉండే బీభత్సాన్ని కొంచము రగ్గించే లక్షణంవల్లనూ దయ్యాలు, అమానుష శక్తులు మొదలైనవి కూడిన దృశ్యాలలో వాస్తవికతను దూరముచేసే అవకాశంవల్లనూ- అనుకూలమైన ప్రదేశము.
2. UR (ఎగువ కుడి)
దీని లక్షణాలు దాదాపు ఎగువ ఎడమ లక్షణాలు వంటివే అయినా దాని కంటె శక్తిమంతమైన ప్రదేశము. భయానక దృశ్యాలకూ, దయ్యాలు అమానిష శక్తులు మొదలైనవి కూడిన దృశ్యాలకూ ఎగువ ఎడమ అంత అనుకూలమైన ప్రదేశముకాదు. ఎగువ ఎడమకంటె దీనికి ప్రేక్షక సామీప్యము ఎక్కువ, తక్కువ ప్రాముఖ్యంగల చిన్నచిన్న సన్నివేశాలు ఇక్కడా సమీకరించవలె.
3. DR (గిగువ కుడి)
ఇద్ ఎక్కువ సానిహిత్యాన్నీ శక్తినీ ఉత్సాహాన్నీ సూచిస్తుంది. ప్రేమ సన్నివేశాలకు, మావత్వాన్నీ రకుణరసాన్నీ పోషించే సన్నివేశాలకు ఎక్కువ అనుకూలమైనది.
4. DL (దిగుగ ఎడమ)
ఇదికూడా సాన్నిహిత్యాన్ని ఎక్కువగా సూచించే ప్రదేశమే. అయినా దిగువకుడి కన్న బలహీనమైనది. అంతమార్ధవం కానిది కావడంవల్ల, ప్రాముఖ్యము తక్కువగల ప్రేమ సన్నివేశాలకు, రహస్య సమాలోచనలకు, ద్వేషాసూయల ప్రకటనకు, కుట్రలకు, ప్రాముఖ్యము ఉండే సన్నివ్చేశాల సమీకరణకు ఉపయోగించదగినది.
5. UC (ఎడమ మధ్య)
ఇద్ దూరాన్నీ కఠినత్వాన్నీ సూచిస్తుంది. అయినా శక్తిమంత