ఈ పుట ఆమోదించబడ్డది




రంగస్థలంమీద జరిగే ప్రతి విషయము ఒక క్రమపద్ధతితో కళాత్మకంగా రూపొందించటం దర్శకుని బాధ్యతలలో ఒకటి. ఏ దృశ్య మేవిధంగా ఉండవలెనో, అందులో ఏ పాత్ర ఏ స్థానంలో ఎప్పుడు ఉండవలెనో దర్శకునకు మానసికంగా ఒక చిత్రము గోచరిస్తుంది. అదేవిధంగా ఆ దృశ్యాన్ని రంగస్థలం మీద ప్రదర్శింపజేసి రససిద్ధికి దర్శకుడు తోడ్పతాడు. ఈ ప్రత్యేక దృశ్యబిభాగాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి, పరిపూర్ణమైన నాటకంగా పరిణామము చెంది, కధాగమనము సాగుతుంది. ఇట్ల్లంటి ప్రతి దృశ్యవిభాగము దానిలోని ముఖ్యోద్ధేశాన్ని ప్రేక్షకులకు అందజేసే అవకాశము కలిగిఉండవలె.

18వ పటము చూడండి. అందలి 1వ బొమ్మలో భీమారావు అనే వ్యక్తి తన కుమార్తె సరోజిని రామారావు అనేవానితో అన్యోన్యంగా ఉండగా చూస్తాడు. రామారావు సరోజినిప్రియుడు. 2వ బొమ్మలో భీమారావు, రామారావులు ఎదురుపడ్డారు. సరోజిని రామారావు వెనక చేరింది. ఇట్లా కధ సాగుతుంది. పాత్ర సమ్మేళనము అందుకు అనుకూలంగా జరుగుతుంది. రంగస్థలంపై రేండుపాత్రలు ఒక విషయమై భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పుడు వారిద్దరిమధ్య సంఘర్షణ (conflict) ఏర్పడుతుంది. ఆ సంఘర్షణకు కారణమైన వస్తువునుగాని, దానిని సూచించే వస్తువును గాని మధ్యను ఉంచి, దానికి రెండుపక్కల రెండు పాత్రలను ఉంచితే సన్నివేశంలోని అర్ధము దృశ్యరూపకంగా ప్రేక్షకులకు అంది, ఆకర్షణీయంగా రూపొందుతుంది. పాత్ర సమ్మేళనంలోని ప్రధానోద్ధేశము ఇదే. పాత్ర సమ్మేళనంలోని ప్రధానోద్ధేశము ఇదే. పాత్ర సమ్మేళనంలో పాత్రల స్వభావ ప్రకృతులకు, కధాసంవిధానానికి అనుకూలంగా అనుగుణంగా వారివారి స్థానాలు నిర్డేశించవలె. దృశ్యరూపంగా కధను ప్రేక్షకులకు అందజేయటం పాత్రసమ్మేళనం లక్ష్యము.

పాత్రసమ్మేళనంలో సౌలభ్యసాధన

అభినయ ప్రక్రియలకు (actions) అనుకూలంగా దృశ్యసమీకరణ