2. వస్తూపయోగము అవసరమైనదానికంటె కొంచెంముందుగా మొదలిపట్టి, తద్వారా రంగస్థల వ్యాపారము సృష్టించుకోవలె.
3. వస్తూపయోగంలో వ్యాపారము జోడించటంద్వారా, కాలవ్యవధి పొడిగించవలె.
4. అవసరమైన రంగస్థల వ్యాపారము వివరాలను రగ్గించి అవసరమైనవాతిని కూడ కుదించుకోవలె.
ఉదా: ఉత్తరము వ్రాయడంలో రెండుమూడు పంక్తులు వ్రాసి ఊరొకోవటం చాలు (పిచ్చిగీతలు గీయటం మాత్రము ఎట్టి పరిస్థితులలోను క్షంతవ్యము కాదు).
5. పెట్టెలో బట్టలు పెట్టవలసివస్తే, ఒకదాని తరవాత ఒకటి వరసగా పెట్టేందులు, దొంతరగాచేసి ఉంచుకొని, ఒకేసారి పెట్టటం బాగుంటుంచి. నాటకప్రతిలో రచయిత చేసే రంగస్థల వ్యాపారచూచనలన్నీ, ఒక్కొక్కసారి దృశ్యసమీకరణ దృష్ట్యా తక్కిన ఇబ్బందులదృష్ట్యా వదలివేయవలసిన అవసరము ఒక్కొక్కసారి ఏర్పడవచ్చు.
ఉదా: ఒకపాత్ర దృశ్యంలో ప్రఫేశి8ంచగానే పక్కపాత్ర "రండి, కూర్చోండి" అనే సంభాషణ చెప్పవలసిఉన్నా, అట్లాగే ఆ పాత్ర కూర్చుండి పోతే నాటకగమనము కుంటుపడిపోయి ప్రేక్షకులకు విసుగు కలగవచ్చు. రెండు పాత్రలూ కూర్చుండి సంభాషణలు సాగిస్తున్నందువల్లకూడా దృశ్యము నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. అట్లాంటి సందర్భాలలొ "రండి! కూర్చోండి!" అనే సంభాషల్ణలోని పక్కపాత్ర తాలూకు రంగవ్యాపారసూచన విస్మరించి కూర్చోకుండా సన్నివేశము సాగించనూవచ్చు; లేదా "పరవాలేదు" అని అదనంగా సంభాషణ పక్కపాత్ర చేర్చ్దుకొని సన్నివేశాన్ని యధాతధంగా కొనసాగించనూవచ్చు.
అనేక సందర్భాలలో, ఒకవస్తువును యధాతరంగా ఉపయోగించడం ద్వారా, ప్రేక్షకుల మనసులలో ఒక ప్రత్యేకభావాన్ని కలిగించడం అనే అవసరం కావచ్చు. ఈరంగకార్యకలాపము తరవాత సన్నివేశంలో విశదంగా బోధపడేదే అయినా, ముందుగా ఆవస్తువు రంగస్థల వ్యాపారంవల్ల, ప్రేక్షకుల మనస్సులలో ఒక స్థానాన్ని ఆశ్రమించుకొంటుంది. ఉదాహరణకు, ఖూనీకి ఉపయోగించే బాకు, ముఖ్య సన్నివేశమ్లో ఈ ముందురంగస్థలవ్యాపారము