చేరుకొంటాడు. సంభాషణలు, కదలికతోపాటు ఉన్నప్పుడు, పూర్తిగా ప్రేక్షకాభిముఖంగా ఉండకుండా, ఒక కోణంలో ఉండడంలో అనుకూల్యమెక్కువ.
పరిశీలనఫల్ల, మూడు లేదా నాలుగు అడుగుల కదలికవల్ల, ప్రేక్షకాసక్తి ప్ర్రుగు;తుందనే విషయము గమనించబడింది. కదలిక ఐదు అడుగులకు మించినదైతే, ప్రేక్షకాసక్తి రగ్గటామేగాక, వారికి విసుగుకూడా వస్తుంది. కాబట్టి మామూలు కదలిక (క్రాస్) మూడు అడుగులు (నిజానికి సర్దుబాటుకు అవసరమైన అదనపు అరడుగుసహా మూడున్నర అడుగులు) మించిఉంటే దృష్టి వికర్షణ (distrortion) పొందుతుంది. ఈ కదలిక తీసుకొనేపాత్ర ముఖ్యమైనది కానప్పుడు, ప్రేక్షకదృష్టి ఈ కదలికమీద కేంద్రీకృతము కానక్కరలేనప్పుడు, రససిద్ధికి ఎట్టి లోపమూ రాదు. మామూలుగా నటుడు మూడడుగుల చలనము సాధిస్తే సుమారు ఐదు అడుగుల కదలిక జరుగుతుంది. ఇంతకన్నా ఎక్కువదూరము నటుడు రంగస్థలంమీద కదలవలసి వచ్చినప్పుడు ప్రదర్శన రక్తికట్టడానికి పద్ధతులు అమలులో పెట్టుకోవలె.
1. క్షణికమైన విరామాలు (pauses) ఇచ్చి, మూడడుగుల కదలికలు అనేకము రూపొందిచవలె.
2. లేదా, ప్రతి మూడడుగుల తరవాత, ప్రేక్షకదృష్టి ఆ పాత్ర నుంచి కరలకుండా, చిన్నచిన్న రంగస్థల కార్యకలాపము (stage business) జోడించవలె- వనకకు తిరిగి చూడటం, సంభాషణ మొదలుపెట్టటం వంటివి.