ఈ పుట ఆమోదించబడ్డది

3. అంగవిక్షేపము చివర శబ్దము చేయవలె.

ఉదా: వేళ్లు విరవటం, బల్ల గుద్దటం

దృశ్యంలోని పాత్ర మానసికమైన శక్తితీవ్రతకు, అంగవిన్యాసముయొక్క శక్తితీవ్రకు స్థాయి స్మానంగా ఉండవలె. మిక్కిలి శక్తిమంతాలూ, మిక్కిలి శక్తిహీనాలూ అయిన అంగవిక్షేపాలు పాత్రయొక్క నిజాయితీ లేమిని (పాత్రధరి అసమర్ధతను) వ్యక్తపరుస్తాయి. పాత్రశక్తికీ, అంగవిక్షేప శక్తికీ ఉండే తేడా అక్కువైనప్పుడు, అది హాస్యాన్ని సృష్టిస్తుంది.

గతివిన్యాస దైర్ఘ్యము (Length of Mocement)

దర్శకుడు, ఒక అడుగు వేయమన్నప్పుడు-దాని అర్ధము- కేవలము ఒక అడుగుమాత్రమేకాదు. ఒక ఆదుగువేసిన తరవాత అందులో-సహజంగా నిలిచి ఉండేటందుకు అవసరమయ్యే సర్దుబాటుకు వేసే అదనపు అరడుగు కూడా కలిపే ఉంటుంది. ఈ ఒక్క అడుగు కదలికలు దృశ్యసమ్మేళనంలో (grouping) మార్పు అవసరంలేక, కేవలం చిన్నచిన్న సర్ధుబాట్లకు (adjustments) మాత్రమే ఉపయోగపడతాయి. దృశ్య సమ్మేళనంలో మార్పును సాధించగల కదలికలను క్రాస్ (cross) అంటారు. X అనేది క్రాస్ కు సూచన. చిన్నచిన్న సర్దుబాట్లను ఈజ్ (Ease) లేదా మూవ్ (move) అ,టారు.

X క్రాస్ అనే పెద్దకదలిక రంగస్థలంలో ముందుకూ, వనకకూ, అడ్డంగా ఉండే అన్ని కదలికలకు వర్తిస్తుంది. రంగస్థలం ఎగువనుంచి (upstage) దిగు;వకు (down stage) వచ్చే సరాసరి కదలికలు అరుదు. వనకకు అంటే దిగువనుంచి ఎగువకు (down stage to upstage) సరాసరి ఉండేవీ. వెళ్లేవిఈ ఉండనే ఉండవు.

సాధారణంగా క్రాస్ లో ప్రేక్షకులకు దూరంగా ఉండే కాలు కదిలించటంతో ఈ చలనము ప్రారంభమవు;తుంది. ఇట్లా ప్రారంభించటంవల్ల, నటుడు ప్రేక్షకాభిముఖంగా కదలికచివర ఉండటం జరుగుతుంది. ప్రేక్షకులకు దగ్గరగా ఉండే కాలితో చలనము ప్రారంభిస్తే, తిరోముఖంగా ఉండేస్థితికి అవకాశ మెక్కువ (చూ.పటము 16). మొదటి పద్దతివల్ల, కదలిక పూత్రిఅయ్యేసరికి మంచిస్థానంలొ నటుడు ఉండటానికి ఈ కదలిక బేసిసంఖ్య అడుగులతో పూర్తికావలె. అట్లా చేయటంవల్ల, నటుడు కొంచెంపక్కకు తిరిగి ఉండే స్థానానికి