ఈ పుట ఆమోదించబడ్డది


కదలికలు

పక్క పాత్రల భావోద్వేగ ప్రభావంవల్లగాని, నాటక కధావసరంవల్ల గాని, లేదా స్వీయ భావోద్వేగాల ఫలితంవల్లగాని, నాటకంలోని పాత్రల కదలికలు బాహ్యంగా ప్రకటితాలవుతాయి. ప్రతి సన్నివేశంలోను, కదలికలు అవసర మయ్యే కారణాలు ఎన్నో ఉంటాయి. ఈ రంగస్థల గతివిన్యాసంవల్లెనే ప్రేక్ష్జకులకు జడత్వంతో కూడిన పాత్రలవలొల కలిగే విసుగుదల పోతుంది. అందుచేత దర్శకుడు రంగస్థల గతివిన్యాసం విషయంలో ఎంతోశ్రద్ధ, కృషి చూపవలసిన అవసర ముంటుంది.

కదలికలో పలురకాలు

ప్రతి కదలికకూ, దానివెనుక ఓక సహజకారణము ఉండి ఉండవలె. ఆ కారణ మాధారంగా సృష్టించబడిన కదలిక సహజత్వాన్ని, దానివెనక ఉన్న కారణము ప్రేక్షకులకు స్పురించేటట్లు రూపొందించవలె.

ఉదాహరణకు: అదుటిపాత్ర మీదగాని, వస్తువు మీద గాని అనిష్టత కలిగినప్పుడు, కదలిక ఆ వస్తువునుంచిగాని, ఆపాత్రనుంచిగాని దూరంగా అనగా వెనకకు రూపొందటం సహజము. ఈ కదలికయొక్క వేగము, దాని వనక ఉన్న కారణంయొక్క శక్తి తీవ్రతనుబట్టి కూడ ఉంటుంది అనేది స్పష్టమైన సత్యము.

సమగతి విన్యాసాలు (Straight Movements)

కదలికలవెనక ఉండే కారణాలు శక్తిమంతాలు, సరళాలు (simple) అయినప్పుడు-కదలికలు సమగతిలో ఉంటాయి. శక్తిమంతాలైన కారణాలవల్ల రూపొందే కదలికలు ఎక్కువ నాటకీయతను కలిగిస్తాయి. కాబట్టి వీటిని అతి ముఖ్యమైన సన్నివేశాల నిర్వహణకు పొదుపుగా ఉపయోగించవలె. నాటకీయత