ఈ పుట ఆమోదించబడ్డది

వర్ణాలు (Colours)

తెలుపు, నలుపు రంగులతోసహా వర్ణాల లేక ముదురుతనాలు, వాటి కాంతి ప్రసరణశక్తి, తీక్షత, విజకులు--వీటినిబట్టి వర్ణాలశక్తి సూచింపబడతుండి. అనాక్రమిత ప్రదేశాలు (Spaces)

ఒక వస్తువుకూ దానిపక్క మరొక వస్తువుకూ మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం పరిమితి పైన కూడా సంరచన ఆధారపడి ఉంటుంది.

అరూప మూలవస్తువులు (Abstract Elements)

శక్తిమంతమైన ఉద్వేగ ఫలితాలిట్టి మూలవస్తువులవల్ల సాధింపబడతాయి. అడ్డురేఖలు (horizantal lines) విశ్రాంతిని సూచిస్తాయి. అడ్డురేఖల ప్రాముఖ్యంగల రూపకల్పన ప్రేక్షకులకు శాంతిని, ఆలోచనను, నిర్లిప్తతను సూచిస్తుంది (చూ.పటము 2.1) అట్లాగే ఐమూలరేఖలు (diagonal lines), తరంగాలవంటి వంపులు (gentle curves) చలనాన్ని, మార్పును; ఎక్కువ వంపులుకలిగి ఒకదానిలో ఒకటి పెనవేసుకొన్న రేఖలు (inter twining curves) భోగాన్ని, కలిమిని సూచిస్తాయి (చూ. పటము 2.2).

వర్ణాలకుకూడా ఈశక్తి ఉంటుంది. ఉదా: లేతవర్ణాలు ఉత్సాహాన్నీ ముదురువర్ణాలు విచారాన్నీ గాంభీర్యాన్నీ సూచిస్తాయి (చూ.పటము 2.3 &4). కాని వీటికితోడు ఇతర పద్దతులనుకూడా కలిపి వినియోగిస్తేతప్ప, శక్తిమంతమైన రూపకల్పన సాధ్యముకాదు. ఉదాహరణకు: ఎరుపు రక్తాన్నీ, అపాయాన్నీ; ఇతర సందర్భాలలో భోగాన్నీ సూచిస్తుంది. అట్లాగే ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ ప్రేక్షకానుభూతికి తెస్తుంది. ఇంతకన్న ముఖ్యమైన విషయము--ఒక్కొక్క వర్ణము ప్రత్యేతంగానేకాక, వర్ణసముదాయంకూడా ఇట్లాంటి అనుభూటి ఫలితాన్ని సాధించగలదు. ఉదాహరణకు: పసుపు, నారింజ, ఎరుపువర్ణాలుకలిసి ఉత్తేజాన్నీ: ఆకుపచ్చ, నీలి, ఉదారంగులుకలిసి వైశాల్యానీ, జడత్వానీ సూచించేశక్తి కలిగిఉంటాయి. బరువు ఉద్వేగభారాన్నీ(emotional weight) సూచించగలదు. ఒక మనిషి గుట్టమీద ఉండడం స్థిరత్వాన్నీ భద్రతనూ (stability and security) సూచిమపజేస్తుంది. అట్లాగాక, కొండగుహలో - అనగా బరువు మనిషి కిందగాక, పైన ఉన్నట్లుగా రూపకల్పన జరిగినప్పుడు-- దానికి విరుద్ద భావాన్ని వ్యక్తముచేస్తుంది. రూపకల్పనలోని ప్రతిమూలాంశమూ ఒక ప్రత్యేక ఉద్వేగానుభూతిని8 ప్రేక్షకులలో సాధించగలదు. ఉదారహరణకు వర్ణాలలో, ముదురు లేతవర్ణాలు ఇచ్చే విభిన్నఫలితాలు.