ఘనరాశులు
రేఖలు, మూలవస్తువు (element) కు సృష్టించవలసిన రూపభావనకు ఉచితమైనవే గాక, భావైక్యం కూడా కలిగి ఉండవలె. చేసిన దృశ్యసంరచనలో యాంత్రికంగా (mechanical) కనిపించే ఫలితాలను కళాత్మకంగా మరుగు పరచటం వల్ల ఆ సంరచజ్న సహజంగాను, ఆకర్షణీయంగాను రూపొందుతుంది.
దృశ్య సంరచన (Scenic Composition)
నాటకంలో ఏ నిశ్చితకాలంలోనైనా దృశ్యాలంకరణ పరికరాలు, నటీనటులు, దుస్తులు, ఆహార్యము, రంగప్రకాశన, పాత్రసమ్మేళన కలిసి రంగ చిత్రము (stage picture) అవుతుంది. ఈ రంగచిత్ర సంరచన చిత్రలేఖనంలోని రూపకల్పనా సిద్ధాంతాలనే అనుసరిస్తుంది. అయితే చిత్రలేఖనంలో లేని ఒక ముఖ్యాంశము నాటకంలో ఉంటుంది. అదే చలనము. ఇది మనస్సులో ఊంచుకొనే దృశ్యసంరచన జరుగుతుంది. ప్రతిరంగ దృశ్యచిత్రంలోను కొన్ని ముఖ్యాంగాలుంటాయి. ఇందులో ప్రతిఅంశము ఒక ప్రత్యేక పద్ధతిలో సంరచనకు సాయపడుతుంది.
రేఖలు (Lines).
రేఖలు యదార్ధరేఖలు (actual lines) సమిష్టిరేఖలు (collective lines) అని రెండురకాలు, సమిష్టిరేఖలు అనేకరేఖల సమూహము. రేఖలను ఒక్కొక్కప్పుడు ఊహామాత్రంగా ఉండే రేఖలుగా సూచించవచ్చు. అట్టిరేఖలు ఊహారేఖలు (Imaginary lines).
ఆకారాలు (Shapes)
ఆకారాలు రెండు పరిమాణాలు (two dimensions) గలవి. ఎత్తు పొడుగులేగాని లోతులేనివిగా కాగితంమీది బొమ్మలవలె ఊహించవలె.
ఘనరాశులు (Masses)
రంగస్థలంమీద ఎత్తు పొడుగులేగాక, లోతు బరువులతో కూడిఉన్నవిగా ఊహింపబడేవి ఘనరాశులు. ఇవి శిల్ఫాలవలె మూడు ప్రమాణాలు గలవి. రంగస్థలంమీద కళాత్మకంగా ముదురు రంగులు ఎక్కువ బరువును, లేత రంగులు తక్కువ బరువును సూచిస్తాయి. ఇదేగాక ఆ వస్తువు ఉపయోగాన్ని బట్టికూడా బరువు సూచితమవుతుంది.