ప్రేక్షకులలో కలిగించవద్దు. ఆట్లా లేనప్పుడు దర్శకుడు దీన్ని ఊహించి ప్రవేశపెట్టవచ్చు.
ప్రేక్షకాశక్తి (Audience Interest)
నాటకం పట్ల ప్రేక్షకానురక్తి ప్రదర్శన మొదటినుంచి చివరవరకూ సాఫీగా అడ్డులేకూండా సాగిపోయేటందుకు జాగ్రత్త పడడం దర్శకునికి విధులలో ఒకటి. ఈఅనురక్తి ఒకేస్థాయిలోగాక తరంగాల మోస్తరుగా వంపులు గలిగి హెచ్చుతగ్గులతో రూపొందుతుంది. ఈహెచ్చుతగ్గులు పరాకాష్టల (climax) ప్రాముఖ్యంమీద ఆధారపది ఉంటాయి. ప్రధ;అన పరాకాష్ట (main climax) ఎత్తు అన్నింటికన్న ఎక్కువగా ఉంటుంది. చాలావరకు ఈ స్థాయీ వైవిధ్యము నాటకరంగంలోనే అంతర్గతంగా రూపొంచి ఉంటుంది. ప్రయోగ పద్ధతులు ఇందుకు సాయపడతాయి.
ఈవిధమైన ప్రేక్షకానురక్తి యొక్క స్థాయీభేదాన్ని, పరిణామాన్నీ 'నిర్మాణము ' (build) అంటారు. ఇద్ ప్రతి అనురక్తితరంగంలోను ఒక ముఖ్యాంశాన్ని ప్రయోగంలో ప్రవేశపెట్టడానికి, అందుకు అవసరమైన తరంగాన్ని శిఖరాగ్రస్థాయికి తీసుకొని పోవడానికి ఉపయోగపడుతుంది. ఇది- కింది వానిద్వారా సాధ్యమవుతుంది.
1. పాత్ర ఉద్వేగ పరిస్థితి
2. ముఖ్యపాత్రల కిచ్చే ప్రాధాన్యంలో వైవిధ్యము
3. ప్రధానపాత్రల కిచ్చే ప్రాముఖ్యంమీద ప్రత్యేకంగా ప్రేక్షక దృష్టిని కేంద్రీకృతము చేయటం
4. రంగస్థలంపై నటీనటుల సంఖ్య
5. కదలికల సంఖ్య, కదలికలలోని దూరము
6. రంగస్థలంలో కాంచి ప్రకాశన తీవ్రత
7. గమనవేగము మొదలైనవి తీవ్రతరము చేయడం
సాధారణంగా పై పద్దతులతో ఏవో కొన్నింటిని మాత్రమే ఆచరణలో పెట్టవలె; ఆచరణలొ పెట్తిన పద్దతులు కూడా మోతాదుగానే వినియోగించవలె. ఎట్టి సందర్భంలోనూ, 'అతి ' పనికిరాదు. మామూలు సన్నివేశాలలో 1, 2, 7 పద్దతుల వినియోగము సరిపోతుంది. ప్రేక్షక కుతూహలాన్ని ఇతోధికంగా