ప్రయోగ ప్రధలనోద్దేశము, ప్రేక్షకావధానము-అమిరక్తి
1. జడవస్తువులమీద కన్న మనుషులమీద
2. మౌనంగా ఉన్న వారిమీదకన్న మాట్లాడేవారిమీద
3. కదలకుండా ఉన్నవారి మీద కన్న కదిలెవారిమీద
4.చీకటిగాఉన్న ప్రదేశాల మీదకన్న వెలుతురుగా ఉండే ప్రదేశాల మీద
5. కాంతి తక్కువైన వర్ణాల మీదకన్న (dull colours) కాంతివంతమైన (bright colours) వర్ణాలమీద.
6. విడివడిన రేఖల మీదకన్న (diverging lines) కలుసుకునే రేఖలమీద
7.దూరంగా ఉన్న వస్తువుల మీదకన్న దగ్గరగా వున్న వస్తువులమీద
8. నటీనటులు పరిశీలించని వస్తువుల మీదకన్న, పరిశీలించే వస్తువుల మీద.
9. రంగస్థలల పార్శ్వాల (కుడి, ఎడమలు) మీదకన్నా మధ్యభాగంమీద
10. వెనకకు వెళ్లుతున్న (moving back) పాత్రమీదకన్న ముందుకు వస్తున్న (moving forward) పాత్రమీద
11. ప్రశాంతంగా ఉన్న పాత్ర మీదకన్న ఉద్వేగ పూరితమైన పాత్రమీద
12. సాధారణ స్థానాలలోను, సాధారణ భంగిమలలోను ఉన్న పాత్రలమీదకన్న ప్రత్యేక స్థానంలోను, ప్రత్యేక భంగిమలోను ఉన్న పాత్రలమీద
13. రంగస్థలంమీద మామూలుగా ఉన్న పాత్ర మీదకన్నమెట్లమీద, వేదికలమీద, ప్రత్యేకంగా ఎత్తైన స్థానాలలోను ఉండే పాత్రలమీద
14. తక్కిన పాత్రలు ప్రస్తావించని పాత్రల మీదకన్నా ప్రస్తావించిన పాత్రలమీద
ఇవి సాధారణ్ పరిస్థితులలో ఉండే అవధానానికి కొన్నిఉదాహరణలు. ఇట్లాంటివి ఎన్నైనా చెప్పవచ్చు. ప్రత్యేక పరిస్థితులలో ఈ అవధానము తారుమారు కావచ్చు
ప్రేక్షకావధానసాధనకు పైపద్ధతులేగాక "తరవాత ఏమి జరుగుతుంది" అనే అనిశ్చిత ప్రతీక్షను (suspense) ఏదో ఒక ప్రక్రియద్వారా