నాటకప్రయోగంయొక్క ముఖ్యోద్దేశము ప్రేక్షకులలో అవధానాన్ని అనురక్తిని (interest) కలిగించి ప్రదర్శనలో రసద్ధికి తోడ్పడటం.
ప్రేక్షకులు 1. ప్రయత్నపూర్వకంగాను, 2. అప్రయత్నంగానూకూడా ప్రదర్శనపట్ల అవధానము చూపుతారు. అప్రయత్రంగా చూపించే అవధానము బాహ్యకారణాల ఫలితంగా రూపొందుతుంది. దీనిని ప్రాధమికావధానము (primary attention) అంటారు. ఉదాహరణకు ఆకస్మికంగా ప్రసరణము చేసే కాంతి, హఠాత్తుగావినిపించే శబ్ధమువంటివి. ప్రయత్నపూర్వకంగా ప్రేక్షకులుపొందే అవధానాన్ని అనుసంధానవధానము (secondary attention) అంటారు. నాటకప్రయోగంలో ముఖ్యమైన ది ప్రాధమిక-అనైచ్చికావధానము (involuntary attention) నాటకము చూడడానికివచ్చే ప్రేక్షకులు ప్రదర్శనపట్ల ఆనందముపొందడానికీ, అనురక్తి చూపడానికీ రంగస్థలము కాంతిమంతముచేయడం మొదలైన క్రియలవల్ల ప్రేక్షకావధానానికీ, వారి ఏకాగ్రతకూ అనుకూలపరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు రంగస్థలంపై జరిగే ప్రదర్శనవల్ల వారికి ఆకర్షణ కలుగుతుంది. ఈ ఆకర్షణ చెడకుండా దర్శకుడు శ్రద్ధవహించవలె. ఈ అప్రయత్నావధానకేంద్రంనుంచి ప్రేక్షక దృష్టి మరలినట్లయితే, వారి ఏకాగ్రతకు భంగంకలిగి అనురక్తి భగ్నమవుతుంది. ప్రయోగంలోని పొరపాట్లవల్ల ప్రేక్షకావధానము చెడకుండా దర్శకుడు తగిన జాగ్రత్తలు తీసుకోవలె. రంగాలంకరణలోనూ, తెరేత్తడంలోనూ, దింపడంలోనూ, ప్రవేశనిష్క్రమణాలలోనూ కలిగేలోపాలు ప్రేక్షకావధానాన్ని చెదరగొట్టవచ్చు. అట్లాగే, అతిశయాభినయము (over-acting), అసహజమైన అంగవిన్యాసాలు, అనవసరమయిన రంగపరికరాలు (ఉదా|| ఉపయోగించని