ఈ పుట ఆమోదించబడ్డది

సంభాషణల విభజన

నాటకంలోని ఒక ప్రత్యేక వాక్యానికి అర్ధము ఏమిటి. అన్న ప్రశ్నకు 1. నాటక అంతరార్ధవిశదీకరణాన్నిబట్టి 2. పాత్ర స్వభావ ప్రకృతినిబట్టి 3.ఆ సంభాషణ జరిగే సన్నివేశాన్ని బట్టి నిర్ణయించుకోవలె.

ప్రతి వాక్యంలోను ప్రాముఖ్యంగల మాట, ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది కాబట్టి నటుడు ఆ ఒక్కమాటకే ప్రాధాన్యము వచ్చేటాట్లు ఒత్తిచెప్పవలసిన అవసరం రావచ్చు. వాక్యానికి సందర్భానుసారంగా దర్శకుడు అంతరార్ధ్ విశదీకరణముచేసుకొని ప్రాముఖ్యంగల మాటలకు ప్రదర్శన ప్రతిలోనూ నటుని పాత్ర ప్రతిలోను కింది గీతలు గీయటం ద్వారా గుర్తుంచుకొనేటట్లు జాగ్రత్త పడవలె.

సంభాషణల విబజన

నాటకంలోని ప్రతిసంభాషణలోను విభిన్నభావాలుంటాయి. కాబట్టి సంభాషణ విభజించకుండా ఒకేవరసన చదివేస్తే సంభాషణ సరిగా అర్ధముకాదు. సంభాషణలోని బావాలను బట్టి ఆ సంభాషణ విభజించు కొని మరీచెప్పవలె. ఈ విభజన విరామమివ్వటం ద్వారాగాని, కంఠస్వరం స్థాయి మార్చటం ద్వారా గాని, గమనవేగంలొ వైవిధ్యం ద్వారాగాని సాధించబడి సప్పుడే ప్రేక్షకులకు అర్ధముకావలసిన విధంగా అర్ధమవుతుంది. భావం మార్పులు మూడు విధాలు ఉంటాయి.

1. భావంలో పూర్తిమార్పు
2. ప్రధాన భావానికి సంబంధించిన మరొక ఉపభావ ప్రకటన
3. భవంలోని ఒక విభాగంనుంచి మరొక విభాగానికిమార్పు

కాబట్టి దర్శకుడు ప్రదర్శన ప్రతిలో ఈవిభజన పొందుబరిచి, నటీనటులకు తెలియజెప్పి ప్రయోగంలో ఉపయోగ పడేటట్లుచేయవలె.