ప్రబోధంవల్ల, పుంజుకొని స్థైర్యంతో నిలబడ గలిగి, తిరిగి ఉన్నత ప్రమాణాలు అందుకోవటం జరుగుతుంది.
పాత్రల అంతరార్ధవిశదీకరణము జరిపేటప్పుడు వాటిలో అసందర్బాలు (inconsistencies) లేకుండా చేయవలె. ఒకవేళ. అట్టి అసందర్బాలు, కధా సంవిధానానికిగాని, కధా వస్తువుకుగాని, ఇతరత్రా గాని అవసరమైనప్పుడు, వాటిని చక్కగా ప్రేక్షకులకు తెలియజెప్పడం అవసరము.
పాత్రల స్వభావ ప్రకృతులు సహేతుకంగా నిర్ణయించిన తరవాత వచ్చేసమస్యలు - ఆ నిర్ణయంప్రాతిపదికమీదనే పరిష్కరించవలె. ఈ సందర్బంలో, లేదా ఈ ప్రత్యేక పరిస్థితులలో ఈ స్వభావ ప్రకృతిగలవక్తి "ఏంచేస్తాడు" 'ఏవిధంగా ప్రతిస్పందిస్తాడు ' అనే ప్రశ్నలు వేసుకొని, దానికి సరిఅయిన జవాబులు అధారంగా ఆ సమస్యను పరిష్కరించవలె.
వాక్య అంతరార్ధ విశదీకరణము (Line interpretation)
ఒక మార్వాడీ "జైగూపాల్" అన్నప్పుడు
ఆంగ్లేయుడు; "హల్లో" అన్నప్పుడు
తమిళుడు "ఎన్నాంగో" అన్నప్పుడు;
మరాఠీవ్యక్తి "కసాకాయ్" అన్నప్పుడు
మనము "కులాసా" అన్నప్పుడు భాషలు వేరైనా అర్ధము ఒకటే. కాని ఒకే సంభాషణయొక్క అర్ధము సందర్బానుసారంగా మాతలలో కొన్నింటిని మాత్రమే ఒత్తి చెప్పి వాటికి ప్రత్యేకప్రాముఖ్యమివ్వడంబట్టీ, మాటకూ మాటకూ మధ్య విరామము (Pause) ఇవ్వటంలోఉన్నవైవిధ్యాన్ని బట్టీ మారుతూఉంటుంది.
ఉదా|| "నేను అక్కదికి రాలేను" అన్న వాక్యార్ధము కిందివిధంగా మార్పు చెందుతుంది.
"నేను అక్కడికి రాలేను" (ఇంకెవరైనా రావచ్చు.)
"నేను అక్కడికి రాలేను" (మరక్కడికైనా రావచ్చు.)
"నేను అక్కడికి రాలేను" (రాలేక పోవటం విషయమైన అశక్తత)
ప్రతి నాటకంలోనూ, ఈవిధంగా సంభాషణలలోని భావోద్దేశాలు మారుతూఉంటాయి.