మొదలైనవి చేర్చినప్పుడు; ఆ శైలిని 'కాలప్నికశైలి ' అంటారు. లైలామజ్నూ వంటి ప్రేమగాధలకు, సాహసకృత్యాలతోకూడిన కధావస్తువులకు ఇది అనుకూలమైన శైలి.
ఫాంటసీ (Fantasy)
'ఒక అవాస్తవిక ;ప్రమంచంలో ఈ నాటకము జరుగుతుంది ' అని ప్రేక్షకులకు సూటిగా చెప్పే శైలి ఇది. దీనిలో దృశ్యాలంకరణలోను, దుస్తులలోను, వేషధారణ మొదలైనవాటిలోను వికృతీకరణ (distortion) ఉంటుంది.
నాటకరచన ఏ శైలికిచెంది ఉంటుందో ప్రయోగ పద్ధతులు కూడా అదే శైలిలో ఉండవలె.
నాటకనిర్మాణము (Structure of Play)
నాటకనిర్మాణాన్ని గూర్చి రెలుసుకోవలెనంటే నాటకేతివృత్తము (plot) ముందుగా తెలుసుకొవలసి ఉంటుంది. నాటక ప్రధానోద్ధేశాన్ని సొదాహరణంగా వివరించేటందుకు ఉపయోగించే క్రమమే ఇతివృత్తము. కధాసరళిని కరతలామలకము చేసుకొంటేనె తప్ప నాటకము చక్కగా అర్థముకాదు. నాటకంలోని కధ మామూలు కధవలె క్రమబద్ధంగా నడవక పోవచ్చు. వీలునుబట్టి కధావస్తువు, సన్నివేశాలు రూపొందుతాయికదా! దర్శకుడు ఈనన్నివేశాలను క్రమబద్ధంగా ఏర్పరచుకొని ఇతివృతాన్ని వ్రాసుకోవలె. ఆ తరవాత సన్నివేశాలవారీగా వ్రాకుకొని ప్రతి సన్నివేశంలోని కధాభాగాన్ని సూచించేపేర్లు వ్రాసుకోవలె. ఈసారాంశాన్ని చూచించేపేర్లు విడిగావ్రాసుకొంటే నాటకనిర్మాణపద్ధతి సుస్పష్టంగా బోధపడుతుంది.
సన్నివేశాల ప్రయోజనము
సన్నివేశాలను వాటి సవభావాలను బట్టి ఈ కింది విధంగా విభజించుకోవచ్చు.
1. సంఘర్షణ సన్నివేశాలు (Sequences of conflict)
వీటిలో ముఖ్యమైనవి మానసిక సంఘర్షణ సన్నివేశాలు (sequences of mental conflict).
2. సాదృశ్య సన్నివేశాలు(parallel Sequences)
సంఘర్షణ లేనివీ, కేవలము కధచెప్పడానికి పనికి వచ్చేవీ. జరిగిన