అంతర్గత భావము
దృక్పధానికి అనుకూలంగా మలచుకోవటానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రకారంగా మలచుకోవడం చూసేప్రదర్శననుబట్టి అసాధ్యమైనప్పుడు చిరాకు పడతాడు. ఈ రకమైన పరిస్థితి ప్రేక్షకునిలో ఏర్పడకుండా ఉండవలెనంటే ప్రదర్శన, పూర్వసన్నాహము, అభ్యాసము ఒక క్రమపద్ధతిపై నడిపించవలె. మొదటినుంచీ ఏ పద్ధతులలో సాగుతున్నదో-వాస్తవిక వాతావరణంలోనా, అద్భుత-అవాస్తవిక వాతావరణంలోనా అనే అంశాలు- ప్రేక్షకులకు తేలికగా బోధపడేటట్లు శ్రెద్ధ తీసుకోవలె.
అంతర్గగ భావము
ప్రయోగంయొక్క అంతర్గతభావన పద్దతికి అనుకూలంగా ప్రేక్షకుడు తన అంతర్గత భావ సంపత్తిని శ్రుతి చేసుకొంటాడు. దీనినే మేకనము (harmony) అంటారు.
నాటకంలోని అంతర్గతభావము హాస్యమా (Comedy) వ్యంగ్యమా (Satire) విషాదమా (Tragedy) శృంగారమా అనేది ప్రేక్షకినికి వ్యక్తము కావలె.
అట్లాగే నాటకాంతాభాగము కూడా ఈ అంతర్గత భావస్థితి (spirit)ని సూచించే శక్తి కలిగి ఉంటుంది. మోదట్లో విషాద సంఘటనలున్నా, సుఖాంతమైన నాటకము ఆశాజనకమైన భావస్థితిని కలిగిస్తుంది. అట్లాగని, విషాదాంత నాటకాలు నిరాశాజనక భావస్థి కల్గిస్తవని అర్ధముకాదు. విషాదాంత నాటకాలలో ఒక పరిపూర్ణత ఉంటుంది. అట్లాతప్ప వేరేవిధంగా జగిగే అవకాశము లేదేమో అనిపిస్తుంది. దృక్పధము (view point), అంతర్గతభావము (spirit), సర్వసామాన్యంగా ప్రేక్షకదృష్టిలో ఒకేవిధంగా ఉంటాయి. ప్రేక్షకులు నాటక ప్రదర్శనాలు చూడడం వారి 'ఆనందం ' కోసమే. హాస్య నాటకాలకన్న, విషాదాంత నాటకాలే వారికి ఎక్కువ తృప్తినీ, ఆనందాన్నీ ఇచ్చే అవకాశమున్నది. విషాదాంత నాటకాలు (tragedies) ప్రేక్షకుల ఉద్వేగాలను (emotions) స్పందింపజేయటమే దీనికి కారణము. అన్నింటికంటే మించి, ప్రేక్షకులు ఉద్వేగ భద్రత (emotional security) కోరుకుంటారు. ఈ భద్రత సక్రమంగా నాటకంలో రూపోందడానికి నాటకంలోని అంతర్గతభావము సహేతుకంగా (logical) సాఫీగా నడవవలెనేగాని, ప్రేక్షకులను అకారణంగా, ఆకస్మికంగా ఆశ్చర్య