పడుతుంది. పుట్టిన మరుక్షణంనుంచి మానవుడు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరికిస్తాడు.
పెద్దలు నడుస్తున్నారు. మాటాడుతున్నారు. రకరకాల చేష్టలు చేస్తున్నారు. వీటిని చూచిన మీదట తాను కూడ నడవవలెననీ, వారివలే మాటడవలెననీ, వారివలె రకకాల చేష్టలు చెయ్యవలెననీ పసిపాకకు కోరిక కలిగి, ప్రగాఢమవుతుంది. అందుకు పసిగుడ్డుగా ఉన్నప్పుడే సాధన మొదలవుతుంది. మానవుడు బాల్య దశనుండే తన చుట్టూవున్న పెద్దలచేష్టలను, వేషభాషాదులను చూసినేర్చు కొంటున్నాడు. ఆ చేష్టలు, వేషభాషాదులు మానవునికి సహజంగా అలవడినట్లే కనుపించుతాయి గాని తెచ్చి పెట్టుకొన్నట్లు అనిపించవు. మనిషికి మనిషికి చేష్టలలో స్వరములో భేదము గోచరిస్తుంది. మానవుడు తాను చూసిన చేష్టాదులను యథార్థంగా గాకవాటి ప్రక్రియను మాత్రమే నేర్చుకొని, తన సొంతం చేసుకొని ప్రత్యేక మానవుడుగా జీవిస్తున్నాడు. దానికంతకూ మానవుని అనుకరణ ప్రవృత్తే ప్రాతిపధిక. ఈ ప్రవృత్తి వల్లనే తాత్కాలికంగా తనను మరుగు పరుచుకొని ఇతరులవలె ప్రవర్తించవలెననే మానవుని అభిలాషకు -అంటే నటించాలనే అభిలాషకు - దారి తీసిందని భావించవచ్చు.
పిల్లల ఆటపాటలు మానవుని అనుకరణ ప్రవృత్తిని, నటనాభిలాషను మరింత విస్పష్టంగా ద్యోతకము చేస్తాయి.
పిల్లలు తల్లితండ్రులుతోపాటు పెళ్లిళ్లకు వెడతారు. పెళ్లి శ్రద్ధగా చూస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లితంతు అంతా ఒక ఆటగా ఆడుతారు. 'ఉత్తుత్త ' పెళ్లి అని వారికీ తెలుసు.
అయితే ఈ బాలబాలికలు ఏ శాస్త్ర గ్రంథాలూ చదివినవారు కాదు. ఈ ఆటలు,. నటనలు ఎవరిదగ్గరా నేర్చుకొన్నవి కావు. మాటలు ఎవరూ వ్రాసి ఇచ్చినవి కావు. ఈ చేష్టలు అప్పటికప్పుడు వారు అలవర్చుకొన్నవి. ఈ మాటలు అప్పటికప్పుడు వారే అల్లుకొన్నవి. ఈ కల్పనాశక్తినే సద్యఃకల్పన (improvisation ) అంటున్నాము. ఈ ఆటలలో వీరు అతి సహజంగా నటిస్తున్నారు. అందువల్ల మానవునికి ఇతర మానవులవలె నటించవలెననే అభిలాష, మానవజీవితాన్ని ప్రదర్శించి చూపవలెననే ఆకాంక్ష. ఇంకొక మానవునివలె జీవించే శక్తి జన్మతః అలవిడినవే కాని తెచ్చి పెట్టుకొన్నవి కావని, నాటకము మానవ జీవితం నుంచి సహజంగా ఆవిర్భవించినదని బోధపడుతుంది. అందుకే పెద్దలు జగ