దర్శకునికి అవసరమైన లక్షణాలు
నాటక దర్శకుడుగా రాణించవలెనని ఆశించే ప్రతి కళాకారుడు ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవలచి ఉంటుంది. అనేక విషయాలు దీక్షతో, ఏకాగ్రతతో పరిశీలించి, కృషిచేయవలసి ఉంటుంది. కనుక దర్శకుడు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిఉండవలె.
1. దర్శకునికి మంచి సాహిత్యజ్ఞానము ఉండవల.
2.ప్రపంచజ్ఞానంతోపాటు, విభిన్న ప్రకృతులు గల మనుష్యులలతో వ్యవహరించే నేర్పు, ఓర్పు ఉండవలె.
3.విభిన్న కంఠస్వరాలను నాటకానుకూలంగాల్ మలచుకొని ఉపయోగించుకోగల పరిజ్ఞానము, పరిపూర్ణత స్వరజ్ఞానము కలిగ్ ఉండవలె.
4.దృశ్యాన్ని కనులవిందుగా రూపొందించే ప్రజ్ఞా ప్రాభవాలు, కళభిరుచి కలవారు కావలె.
5.రంగస్థల రూపకల్పనకు తగిన శిల్ప, చిత్రలేఖన, వాస్తుపరిజ్ఞానము కలిగి ఉండవలె.
6. ఆత్మవిశ్వాసంతో సమస్యలను ఎదుర్కొనే నేర్పు, ఓర్పు, పరిపాలన దక్షత కలిగి ఉండవలె.
7. నిర్ణీత సమయానికి ప్రదర్శన ప్రాతంభించేటట్లు చూడవలె.
8.నటీనటులకు తాను ఆదర్శపాయుడై ఉండి, వారిలో క్రమశిక్షణ, సహజీవన భావాలు నెలకొల్పి, మిత్రుడుగా, మార్గదర్శకుడుగా వ్యవహరించవలె.
9.సామాన్య ప్రేక్షకులు దర్శకుని ప్రతిభ గుర్తించలేక, నటీనటులనే మెచ్చుకొంటూ ఉండడం సహజము. అందుచేత దర్శకుడు బాధ్యత గుర్తించిన కళాకారుడై, అసూయా దూరుడై నిష్కామదృష్టితో తన ధ్యేయాన్ని సాధించవలె.