ఈ పుట ఆమోదించబడ్డది

వర్తమాన నాటకరీతులు

ఉదా|| యన్.జి.వో.
2.భూస్వాములకు, రైతులకు మధ్యసంఘర్షణ
ఉదా|| కూలీ, పాలేరు
3.ఒకవర్గం అగచట్ల
ఉదా|| నేతబిడ్డ.
4.ఒక వ్యక్తి శీల చిత్రణ
ఉదా||కీర్తిశేషులు, మాస్టర్ జీ.
5.స్వాప్నిక జగత్తుకు, నిత్య జీవితానికి గల అంతరాన్ని ప్రదర్శించే నాటకాలు.
ఉదా|| గాలిమేడలు, తీరని కోరికలు

6.మనస్తత్వ నిరూపక రచనలు
ఉదా|| ఆత్మవంచన.

ఇవి అన్నీ ఇతివృత్త నిర్మాణానికి సంబంధించిన రీతులు, ఇక రచనావిధానానికి సంబందించినవి:

7.ప్రహసనాలు, ప్రహసనప్రాయాలైన ఆహ్లాదరూపకాలు
ఉదా|| నాటకం, తుఫాను.
8.గేయ రూపకాలు, వచన గేయరూపకాలు
ఉదా|| మహోదయం, ఆశ, అల్లీముఠా.
9.శ్రవ్య రూపకాలు లేదా రేడియో నాటికలు: శతాధికంగా వ్రాయబడుతున్న ఈ రూపకాలలో ముఖ్యమైనవిగా కొన్నింటిని పేర్కొనడం సాహసము. గోరాశాస్త్రి, హితశ్రీ, అమరేంద్ర ప్రభృతులు ఈ ప్రక్రియలో ఎంతో కృషిచేసినారు.