ఈ పుట ఆమోదించబడ్డది

సంభాషణలు నడపడంలో, వ్యంగ్య ప్రయోగంలో రాజమన్నారు సిద్ధహస్తులు. వీరి సంభాషణలు పాఠక, ప్రేక్షక హృదయాలలో సూటిగా నాటుకొంటాయి.

రాజమన్నారు అపూర్వసృష్టికి మనోరమ, కనకాంగి, సుర, జయశ్రీ పాత్రలు తార్కాణాలు. వీరి రచనలు సండేశప్రధానాలు.

రాజమన్నార్ ప్రచురించిన నాటికలు 15, ఆయన వ్రాసిన నాటకాలు రెండింటిలో మనోరమ ఒక్కటే ప్రచురితము.

కొప్పరపు సుబ్బారావు

నాటకరనలోనేగాక్, నాటకకళలోని వివిధశాఖలలో నిష్టాతులు కొప్పరపు సుబ్బారావుగారు (1896-1957). ఉత్తమ ప్రయోక్త, ప్రాచ్య, పాశ్చాత్య నాటక సాహిత్యాన్ని, నాటకరంగాన్ని అధ్యయనము చేసినవారు కావడంవల్ల కొప్పరపువారి నాటకాలు నాటకీయతతో, కొత్త పోకడలతో, కొత్త వ్యఖ్యలు-ఆకర్షణలతో తొణికిసలాడుతూ ఉంటాయి. వీరి నాటకాలలో నటనకు కొత్తకొత్త ప్రయోగాలకు తవు ఎక్కువ. స్త్రీ పాత్ర చిత్రణలో, సంఘర్షణ చిత్రణలో వీరు బహు ప్రజ్ఞావంతులు. వీరు సృజించిన రోషనార, తార, నూర్జహాన్ సజీవమూర్తులు. ఈ పాత్రల హృదయాలలో చెలరేగిన సంఘర్షణను విస్పష్టంగా ద్యోతకము చేసి ఆ యా పాత్రల అంతర్జీవితాన్ని ప్రేక్షకుల కన్నులకు కట్టేటట్టు చేసినారు సుబ్బారావుగారు.

హాస్యరసపోషణలో వీరు దిట్టలు. "రోషనార" లోని హాస్యపాత్రలు రజాక్, దావూర్ కలకాలము నిలిచే పాత్రలు.

నాటక రచనలోనేకాదు, నాటికారచనలోకూడ వీరు సిద్ధహస్తులు. ఏకాంకిమలకు విలువ, బహుళ ప్రచారము కలిగించింది సుబ్బారావుగారే. వీరి ఏకాంకికలు 'నేటి నటుడు,' 'చేసినపాపం ' ప్రయోగానికి వారు పొందుపరచిన సూచనలు అమూల్యమయినవి. 'అల్లీముఠా ' గేయనాటిక. అది ఇంగ్లీషునాటికకు చాయ అయినా తెలుగుదనాన్ని పొదువుకొన్నది; నాటకీయతకు ఆటపట్టు. అందుచేతనే ఈ నాటిక వందల పర్యాయాలు ప్రదర్శితమై ప్రజల మెప్పును పొందింది. 'అల్లీముఠా ' నేటి సామాజిక జీవితానికి ప్రత్యేక వాఖ్య. 'నేటి నటుడు ' నేటి తెలుగు నాటకరంగంలోని వెర్రిపోకడలపై నీసిత విమర్శ.