ఈ పుట ఆమోదించబడ్డది

పి.వి.రాజమాన్నారు

సుదీర్ఘమైన ఉపోద్ఘాతంలో సారంగధర చరిత్రను గురించిన నిజానిజాలను గూర్చి విపులంగా రచయిత చర్చించినారు.

'మద్మవ్యూహము ' వీర - అద్భుతరసప్రధానము. అభిమన్యుని చమపడంలోవచ్చే ఐదు అనుమానాలకు తాము ఇందులో సమాధానము చెప్పినామని రచయిత చెప్పుకొన్నారు. ఇది ప్రదర్శనయోగ్యమైన నాటకము.

పి.వి.రాజమన్నారు

పద్యాలు, పాటలు లేని నాటకాలు నటకాలా అనే రోజులలో వచన నాటకాలను ఆదరణలేని రోజులలో, అభూతకల్పనలతో పౌరాణిక, చారిత్రక నాటకాలు కుప్పలుతిప్పలుగా వెలువడుతున్న రోజులలో వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ వచన నాటకయుగానికి మొరొకసారి నాందీ వాచకము పలికిన నాటకకళావేత్త పి.వి.రాజమన్నారు. 'తప్పెవరిది ' నాటకంతో తెలుగు నాటకరంగంలో నూతనయుగము ప్రారంభమైంది.

ప్రాచ్య పాశ్చాత్య నాటకరీతులను బాగా అవలోదన చేసిన సంస్కృతి గలవారు రాజమన్నారుగారు. నేటి సమాజంలో స్త్రీ - ముఖ్యంగా వేశ్య స్వాతంత్ర్యము, తిరుగుబాటు వీరి అభిమానవిషయాలు, ఇబ్సన్ , చెకోవ్ ల ప్రభావం వీరి మీద ఎక్కువ కనిపిస్తుంది. ఒబ్ సస్ నాటకము 'బొమ్మరిల్లు ' (Doll's House) లో నాయిక 'నౌరా 'చాయలు, తిరుగుబాటుతత్వము రాజమన్నారు 'తప్పెవరిది,' 'ఏమిమగవాళ్ళు ' రూపమాల నాయికలలో పొడగడతాయి. తప్పెవది నాటకంలోని నాయిక తనను అనుమానించిన ముసలిభర్తను దులిపివేస్తుంది. 'ఏమిమగవళ్లు ' నాటికలోనినాయిక కనకాంగి మంగళసూత్రాలను తెంచి పారవేస్తుంది.

'మనోరమ ' నాటకము రాజమన్నారు నాటకరచనా శిల్పానికి పరాకాష్ఠ. దిక్కులేని పక్షి మనోరమను తన జీవితరేఖను తానే స్వశక్తితో తీర్చిదిద్దుకొన్న దిట్టగా చిత్రించి, ఆమద్వారా స్త్రీ తన స్వశక్తిమీద తాను ఆధారపడవలెనని సందేశమిచ్చినారు. వీరి నాటకాలలో, నాటికలలో అంతర్వాహినిగా "లోకం ఇంకా ప్రేమించడం నేర్చుకోవలె" అనే సందేశము ప్రవహిస్తూ ఉంటుంది.